ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియామకాల్లో అక్రమాలపై విచారణ జరపాలి

ABN, First Publish Date - 2021-05-11T05:41:25+05:30

వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పశు సంవర్థకశాఖలో ఇటీవల జరిగిన పోస్టుల నియామకాల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, మే 10: వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పశు సంవర్థకశాఖలో ఇటీవల జరిగిన పోస్టుల నియామకాల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు  డిమాండ్‌ చేశారు. పశు సంవర్థకశాఖలో 147 ల్యాబ్‌ టెక్నీషియన్లు, మరో 147 ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టులను భర్తీ చేసిందన్నారు. అయితే వెటర్నరీ యూనివర్సిటీ రిజిష్ట్రార్‌ మాధవరావు రాత పరీక్ష నిర్వహించకుండా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు అనుబంధంగా మరొక జీవో తెప్పించుకొని కేవలం తన ఇష్టానుసారంగా నిమామకాలు చేసేందుకు అనుమతులు తీసుకున్నారని ఆరోపించారు. తనకు కావాల్సిన వారిని అడ్డదారిలో ఎంపిక చేసి, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించకుండా అడ్డగోలు నియామకాలు చేసి వివిధ జిల్లాలో జాయింట్‌ డైరెక్టర్లకు సెలెక్ట్‌ లిస్ట్‌ పంపించారన్నారు. అక్రమంగా జరిగిన నియామకాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.  

 

Updated Date - 2021-05-11T05:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising