ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 నుంచి బీసీ కులాల జనగణన సాధనా ఉద్యమం

ABN, First Publish Date - 2021-12-31T05:57:32+05:30

దేశంలో ఓబీసీ కులాల జనగణన చేయాలని డిమాండ్‌ చేస్తూ జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి నుంచి ఏప్రిల్‌ 11న మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వరకు మహా ఉద్యమం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు.

ప్రదర్శనలో కేసన, క్రాంతికుమార్‌ ఇతర నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు 

గుంటూరు, డిసెంబరు 30: దేశంలో ఓబీసీ కులాల జనగణన చేయాలని డిమాండ్‌ చేస్తూ జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి నుంచి ఏప్రిల్‌ 11న మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వరకు మహా ఉద్యమం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. ఉద్యమంలో భాగంగా గురువారం గుంటూరులో నగర అధ్యక్షుడు ఉప్పుటూరి పేరయ్య, దొంతా బ్రహ్మం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గార్డెన్స్‌ నుంచి ట్రావెలర్స్‌ బంగ్లా సెంటర్‌లోని పూలే విగ్రహం వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకత్వం బీసీల పట్ల మొండివైఖరి అవలంభిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కులాల జనగణన చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు. కార్యక్రమంలో సంఘ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌, నాయకులు పరసా రంగనాఽథ్‌, గోనుగుంట్ల బ్రహ్మానందశర్మ, ముప్పన వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, బాలయ్య, యామా మురళీ, బాదుగున్నల శ్రీను, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

 

Updated Date - 2021-12-31T05:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising