ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటిపన్ను కట్టాకే ఆస్తి పన్ను చెల్లించాలి

ABN, First Publish Date - 2021-01-21T05:24:08+05:30

నగరపాలక సంస్థ క్యాష్‌ కౌంటర్లలో ముందుగా నీటిపన్ను చెల్లించిన అనంతరం ఆస్తి పన్ను వసూలు చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ పి.నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు కమిషనర్‌  నిరంజన్‌రెడ్డి

గుంటూరు(కార్పొరేషన్‌),జనవరి 20: నగరపాలక సంస్థ క్యాష్‌ కౌంటర్లలో ముందుగా నీటిపన్ను చెల్లించిన అనంతరం ఆస్తి పన్ను వసూలు చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ పి.నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్‌వోలు, ఆర్‌ఐలతో బుధవారం ఆస్తి, నీటిపన్ను వసూళ్ల వేగవంతంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్‌ మాట్లాడుతూ నీటి పన్ను వసూళ్ళు ఆశించినస్థాయిలో లేదని, రెవెన్యు ఇన్‌స్పెక్టర్‌లు బృందాలుగా ఏర్పడి వసూళ్ళు వేగవంతం చేయాలన్నారు. నీటి చార్జీలు చెల్లించని గృహాలకు రెడ్‌ నోటీసులు జారీచేసి తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆస్తి పన్ను వసూళ్లపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లవారీగా సమీక్షించారు. రోజువారీ వసూళ్ళ వివరాలను ప్రతిరోజు సాయంత్రానికి రెవెన్యూ గ్రూప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. షాప్‌ల అద్దె వసూళ్ళు వేగవంతం చేయాలని, రెన్యువల్‌ చేయాల్సినవాటిని సిద్ధం చేయాలన్నారు. బకాయిలు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు రిమైండర్‌ నోటీసులు అందించాలని ఆదేశించారు.  కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు డి. శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, ఆర్‌వోలు ప్రసాద్‌, వేణుబాబు, బాలాజీబాషా, రవికుమార్‌, ఆర్‌ఐ లు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T05:24:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising