ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పటికైనా మోదీ కళ్ళు తెరవాలి: ఎమ్మెల్సీ లక్ష్మణరావు

ABN, First Publish Date - 2021-03-05T18:08:06+05:30

విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం చేపట్టిన రాష్ట్ర బంద్ గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతోంది. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్‌లో వామపక్ష పార్టీల నేతలు రోడ్డుపై బైటాయించి నిరసన తెలుపుతున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావుతోపాటు సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం త్యాగాల ఫలితంగా ఏర్పడిందన్నారు. అందుకు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోందన్నారు. సీఎం జగన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి.. ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ బంద్‌ను చూసైనా ప్రధాని మోదీ కళ్లు తెరవాలన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అన్ని రాజకీయపార్టీలు జెండాలను పక్కనపెట్టి ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు.

Updated Date - 2021-03-05T18:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising