ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రుల్లో అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది: పేర్ని నాని

ABN, First Publish Date - 2021-09-16T22:53:47+05:30

ఆస్పత్రుల్లో అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆస్పత్రుల్లో అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాడు-నేడులో భాగంగా విరాళాలిచ్చే దాతల పేర్లు స్కూళ్లు, ఆస్పత్రులకు పెట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నకిలీ మందులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. 1983 నుంచి ఆగస్టు 15, 2011 వరకు లక్షల మంది పేదలు ఇళ్ల పట్టాలు కుదువ పెట్టారన్నారు. 46 లక్షల మందికి వన్ టైం సెటిల్‌మెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని, పల్లెల్లో 42 లక్షల 3907 మంది, పట్టణాల్లో 4 లక్షల మందికి పథకం వర్తిస్తుందని తెలిపారు. డిసెంబర్ 21న ఈ దరఖాస్తుదారులకు ఆస్తిపత్రాలు అందించడం.. రూ.14,609 కోట్లు వన్ టైం సెటిల్‌మెంట్ ద్వారా పరిష్కారిస్తామని పేర్ని నాని చెప్పారు. 

Updated Date - 2021-09-16T22:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising