ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagan ప్రభుత్వాన్ని నమ్మలేం.. పూర్తి ప్రకటన వచ్చాకే.. : బుచ్చయ్య

ABN, First Publish Date - 2021-11-22T19:07:40+05:30

మూడు రాజధానుల బిల్లులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : మూడు రాజధానుల బిల్లులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇటు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. అటు తెలుగు తమ్ముళ్లు, అమరావతి జేఏసీ నేతలు పెద్ద ఎత్తునే స్పందిస్తున్నారు. విశాఖ పర్యటనలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏబీఏన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. చట్టాన్ని నిర్ణయాన్ని వ్యతిరేకత నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నామని బుచ్చయ్య చెప్పుకొచ్చారు. 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకోవడం సంతోషకరమన్నారు. 


నమ్మలేం..!

అయితే.. జగన్ ప్రభుత్వాన్ని నమ్మడానికి వీల్లేదని.. పూర్తి ప్రకటన వచ్చాక దీనిపై మాట్లాడతామని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిగా సీఆర్డీఏలో స్పష్టంగా ఉందని.. అమరావతి సె౦టర్ పాయింట్‌గా అన్ని సదుపాయాలు ఉన్నాయనే మొదట్నుంచి తాను చెబుతూ వస్తున్నానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇప్పట్లో ప్రభుత్వం సుప్రీంకి వెళ్లినా 3 రాజధానులు చెల్లుబాటు కాదని చెప్పారు. అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందాలని ఎప్పుడో చంద్రబాబు చెప్పారని.. ఆయన ఉత్తరా౦ధ్రకి వ్యతిరేకం కాదని బుచ్చయ్యచౌదరి చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-11-22T19:07:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising