ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ర్టానికి నిధులు రాబట్టండి

ABN, First Publish Date - 2021-01-26T08:58:06+05:30

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలకు సన్నద్ధం కావాలని వైసీపీ ఎంపీలను సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టేలా కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ ఎంపీలకు సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలకు సన్నద్ధం కావాలని వైసీపీ ఎంపీలను సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టేలా కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. తాడేపల్లిలో సోమవారం వైసీపీపీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలవరం సాగునీటి ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55656.87 కోట్లకు ఆమోదం రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 16 మెడికల్‌ కాలేజీలలో మూడింటికి కేంద్రం ఆమోదం తెలిపిందని.. మరో 13 కాలేజీలు మంజూరు చేయాలని కేంద్రాన్ని ఒప్పించాల్సిన బాధ్యతను తీసుకోవాలని ఎంపీలను సీఎం ఆదేశించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం సేకరించిన ధాన్యానికి కేంద్రం రూ.4,284 కోట్లు చెల్లించాల్సి ఉందని, దీన్ని కూడా రాబట్టాలని అన్నారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులు రూ.1842.45 కోట్లు రావాల్సి ఉందన్నారు. హైకోర్టును కర్నూలులో పెట్టేందుకు, ఉపాధి బకాయిలు రూ.3,707.77 కోట్లు, ఆర్థిక లోటు 18,830 కోట్లను రాబట్టాలన్నారు. 

Updated Date - 2021-01-26T08:58:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising