ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంగవరం పోర్టును అదానీకి పప్పు బెల్లాలకు అమ్మేశారు: పట్టాభి

ABN, First Publish Date - 2021-12-27T21:05:46+05:30

రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటా 2.1 రెవెన్యూ షేర్ కలిగిన.. గంగవరం పోర్టును పారిశ్రామిక వేత్త అదానీకి పప్పు బెల్లాలకు అమ్మేశారని టీడీపీ నేత పట్టాభి తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటా 2.1 రెవెన్యూ షేర్ కలిగిన.. గంగవరం పోర్టును పారిశ్రామిక వేత్త అదానీకి పప్పు బెల్లాలకు అమ్మేశారని టీడీపీ నేత పట్టాభి తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరంతర ఆదాయం వచ్చే పోర్టును కమీషన్ల కోసం అమ్మేశారని దుయ్యబట్టారు. జీవో 12లో ఎంపవర్ గ్రూప్ సెక్రటరీల కమీటి ఓపెన్ బిడ్ ద్వారా అమ్మాలని, సిఫార్సు చేసినా లీగల్ ఒపీనియన్ పేరుతో అదానీకి కట్టబెట్టారని ఆరోపించారు. గంగవరం పోర్టును రూ.645 కోట్లకే అమ్మడం వెనుక భారీ స్కాం ఉందని ఆరోపించారు. జ్యుడీషియల్‌ ప్రివ్యూ యాక్ట్ ప్రకారం 100 కోట్లు పైబడిన ఏ టెండరైనా.. ఓపెన్ బిడ్ ద్వారా జరగాలని చెప్పి నిబంధనలు ఎందుకు పాటించలేదు? అని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్న పభుత్వం.. గంగవరం పోర్టును ఎందుకు ప్రైవేటీకరణ చేశారో చెప్పాలి? అని పట్టాభి ప్రశ్నించారు.

Updated Date - 2021-12-27T21:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising