ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి భూముల కొనుగోలు కేసుపై పూర్తి స్థాయి తీర్పు

ABN, First Publish Date - 2021-07-21T01:45:19+05:30

అమరావతి భూముల కొనుగోలు కేసుపై పూర్తి స్థాయి తీర్పును సుప్రీంకోర్టు విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతి భూముల కొనుగోలు కేసుపై పూర్తి స్థాయి తీర్పును సుప్రీంకోర్టు విడుదల చేసింది. అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగలేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తులు వినీత్ శరన్, దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం  సమర్థించింది. వాస్తవాలను పరిశీలించిన తరువాతే ఎఫ్ఐఆర్‌లను కొట్టివేసిందని పేర్కొంది. పిటీషన్లను స్వీకరించి తీర్పును ఇవ్వడంలో చట్ట విరుద్దంగా  ప్రవర్తించలేదని పేర్కొంది. అన్ని కోణాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుందని తెలిపింది. రాజధాని ఎక్కడ అన్నది రహస్యమేమీ కాదని, అది అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొంది. పబ్లిక్ డొమైన్‌లో ఎప్పటి నుంచో ఉందని తెలిపింది.


భూములు అమ్మిన వారికి నష్టం వాటిల్లిందని చెప్పడానికి ఆధారాలు లేవంది. కొనుగోలుదారులు మోసం చేశారన్న వాదనలకు తావు లేదంది. అమ్మకందార్ల  ప్రయోజనాలను కాపాడేందుకు కొనుగోలుదారులతో వారికి న్యాయపరమైన సంబంధం ఏమీ లేదని పేర్కొంది. ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందం కావడంతో అవినీతి నిరోధక చట్టం కింద ప్రభుత్వ అధికారులపై కేసులు పెట్టలేరని పేర్కొంది. దర్యాప్తును ప్రాధమిక స్థాయిలోనే అడ్డుకునే పరిధి హైకోర్టుకు లేదన్న వాదనను  సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.



Updated Date - 2021-07-21T01:45:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising