ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజీపీ వ్యాఖ్యలను మరోసారి తప్పుపట్టిన జవహర్

ABN, First Publish Date - 2021-01-16T01:10:36+05:30

డీజీపీ గౌతం సవాంగ్‌ తీరును మరోసారి మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ తప్పుపట్టారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: డీజీపీ గౌతం సవాంగ్‌ తీరును మరోసారి మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ తప్పుపట్టారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘డీజీపీ వాస్తవాలు ప్రకటిస్తారనుకుంటే అసత్యాల్ని చెబుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళను కూడా దాడుల చేసిన వారిగా చిత్రీకరిస్తున్నారు. అన్యమత ప్రచారం మంత్రులు తిరుపతి కొండమీద చేస్తే డీజీపీ ఏం చర్యలు తీసుకున్నారు?. పూజారులను కొరడాతో కొడితే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోవడం పక్షపాతం చూపించడమే. ఆంజయనేయస్వామి చెయ్యే కదా విరిగింది ఏమవుతుందని మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. అసలు నిందితులైన మంత్రులును వదిలేసి.. అమాయకులపై కేసులు పెడుతున్నారు. మత విద్వేషాలు రెచ్చకొట్టిన కొడాలి నానిని అరెస్ట్ చేస్తే సామాజిక న్యాయం అవుతుంది. రాష్ట్రంలో రూల్ ఆప్ లా సక్రమంగా అమలయ్యేలా డీజీపీ వ్యవహరించాలి. డీజీపీలా మాట్లాడకుండా మంత్రిలా మాట్లాడుతున్నారు’ అంటూ జవహర్ ధ్వజమెత్తారు.

Updated Date - 2021-01-16T01:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising