ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ

ABN, First Publish Date - 2021-04-19T09:47:24+05:30

‘‘తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైసీపీ నేతలు అడ్డగోలుగా వ్యవహరించారు. బయట ప్రాంతాల నుంచి వేలాది మందిని తీసుకువచ్చి దొంగ ఓట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొంగ ఓట్లకు డీజీపీదే నైతిక బాధ్యత: అయ్యన్న


నర్సీపట్నం, ఏప్రిల్‌ 18: ‘‘తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైసీపీ నేతలు అడ్డగోలుగా వ్యవహరించారు. బయట ప్రాంతాల నుంచి వేలాది మందిని తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’’ అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక విలేకరులకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. తిరుపతి ఉప ఎన్నికలో గెలుస్తామన్న ధీమా ఉంటే వైసీపీ భారీ ఎత్తున దొంగ ఓట్ల దందా ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మంత్రిగా ఉండి ఇటువంటి పనికిమాలిన పనులు చేయడానికి సిగ్గులేదా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. దొంగ ఓట్ల దందాకు డీజీపీనే బాధ్యుడన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి డీజీపీ సవాంగ్‌ తన పదవి నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి, గవర్నర్‌ కలుగచేసుకొని తిరుపతి పార్లమెంటు స్థానానికి రీ పోలింగ్‌కు ఆదేశించాలని అయ్యన్న కోరారు.

Updated Date - 2021-04-19T09:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising