ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధూళిపాళ్ల కుటుంబంపై రాజకీయ కుట్ర: అమరనాథ రెడ్డి

ABN, First Publish Date - 2021-04-23T17:50:40+05:30

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుపై మాజీ మంత్రి అమరనాథ రెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుపై మాజీ మంత్రి అమరనాథ రెడ్డి స్పందించారు. తిరుపతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ నరేంద్ర అరెస్టు కక్ష సాధింపు చర్యేనని వ్యాఖ్యానించారు. ఇదొక దుర్మార్గపు చర్య అని... దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సంగం డెయిరీ ద్వారా పాడి రైతులను ఆదుకుంటూ వారికి అండగా నిలుస్తున్నారనే అక్కసుతోనే అరెస్ట్ చేశారన్నారు. హుందా రాజకీయలతో రాణిస్తున్న వారి కుటుంబంపై రాజకీయ కుట్రకు దిగారన్నారు. నరేంద్రను ఎందుకు అరెస్ట్ చేసారో రైతులు, ప్రజలకు తెలియనిది కాదని, అధికారం ఉందని ఇలాంటివి చేయడం దారుణమన్నారు. వీటన్నింటికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 

Updated Date - 2021-04-23T17:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising