ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి నానితో ముగిసిన ఎగ్జిబిటర్ల సమావేశం

ABN, First Publish Date - 2021-11-11T00:32:58+05:30

రాష్ట్రంలోని సినిమా సమస్యలపై నగరంలో మంత్రి పేర్ని నానితో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్రంలోని సినిమా సమస్యలపై నగరంలో మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్ల సమావేశం ముగిసింది. మూడు జిల్లాల ఎగ్జిబిటర్లతో మంత్రి పేర్ని భేటీ అయ్యారు. పెద్ద సినిమాలకు టికెట్ పెంపు విషయంపై ఇంకా పరిష్కారం కాలేదు. కానీ సమస్యను సీఎం వద్ద చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. అనంతరం ఎగ్జిబిటర్ అంబికా కృష్ణ మాట్లాడుతూ ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఆన్‌లైన్‌ విధానానికి ఎగ్జిబిటర్లు అంగీకారం తెలిపారన్నారు. చిన్న, చిన్న సమస్యలు ఉంటే  పరిష్కారం అవుతాయన్నారు.


నల్లజెర్ల లాంటి చిన్నఊర్లలో థియేటర్లలో గ్రేడింగ్ సిస్టం పెట్టాలని మంత్రి నాని సూచించారని అంబికా కృష్ణ తెలిపారు. ఆ దిశగా ఆలోచించాలని  థియేటర్ యజమానులకు మంత్రి సూచించారని ఆయన పేర్కొన్నారు. సినిమా  థియేటర్‌లో టికెట్ రేట్ల పెంపుదల, తగ్గింపుపై సీఎం జగన్‌తో చర్చించిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. రేట్ల పెరుగుదలపై సీఎం జగన్‌తో మరోసారి  చర్చిస్తామని ఆయన తెలిపారు. 


Updated Date - 2021-11-11T00:32:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising