ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇచ్చిన వాగ్ధాలను మరిచిన సీఎం జగన్: మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు

ABN, First Publish Date - 2021-09-02T22:12:20+05:30

రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లపై విధించిన షరతులను గోపాలపురం మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లపై విధించిన షరతులను గోపాలపురం మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తప్పుబట్టారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో మండల పరిషత్ అధికారులకు  ఏ నెల పెన్షన్ ఆ నేలే ఇచ్చే విధానాన్ని ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున వినతి పత్రం అందజేసే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత సార్వత్రిక ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 వేల పెన్షన్ 3 వేలు చేస్తానని,  అదేవిధంగా 45 సంవత్సరాల దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చి ఎన్నికల అనంతరం మాట తప్పారు. గత టీడీపీ ప్రభుత్వం లో 2 వేలు రూపాయలు ఉన్న పెన్షన్ ని  రెండున్నర సంవత్సరాల్లో కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచాడు. అంతేకాక 45 సంవత్సరాల మహిళలకు పేన్షన్ ఊసే ఎత్తడం లేదు. 


గతంలో ఒక నెల పెన్షన్ తీసుకొని వారికి మరో నెలలో పెన్షన్ తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ వెసులుబాటును తొలగిస్తూ ఏ నెల పెన్షన్ ఆ నెలలో తీసుకోకపోతే తరువాత నెలలో పెన్షన్ ఇవ్వమని ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు. అంతేకాక  రెండు సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్లో ఉన్న సచివాలయ ఉద్యోగుల రేషన్ కార్డులను సరెండర్ చేయమని ఉత్తర్వులు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. ఇక ఒక ఇంట్లో ఒక పెన్షన్ ఉంటే మరొకరికి పేన్షన్ ఇవ్వమని చెప్పడం అన్యాయమన్నారు. ఇదేవిధంగా కొనసాగితే త్వరలో పెన్షన్ దారులందరూ రోడ్డుమీదకు వచ్చి నిరసన తెలుపుతారని హెచ్చరించారు. ఇకనైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు.

Updated Date - 2021-09-02T22:12:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising