ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రి అత్యవసర వేళల్లో ఉమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం వాహనం

ABN, First Publish Date - 2021-12-08T05:18:16+05:30

మహిళల రక్షణ, భద్రత కోసం ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఉమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం వాహనం మంగళవారం కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుంది.

ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఉమెన్‌ డ్రాప్‌ ఎట్‌హోం వాహనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  కాకినాడ క్రైం, డిసెంబరు 7: మహిళల రక్షణ, భద్రత కోసం ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఉమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం వాహనం మంగళవారం కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుంది. మహిళా భద్రతే ధ్యేయంగా వర్కింగ్‌ ఉమెన్‌, విద్యార్థులకు రాత్రి సమయాల్లో బాసటగా ఉండి, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఈ వాహనాన్ని కాకినాడ సిటీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో సేవలందించేలా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు చర్యలు తీసుకున్నారు. ఈ వాహనంలో ఒక పోలీసు డ్రైవర్‌, మహిళా కానిస్టేబుల్‌ ఉంటారని, ప్రతీరోజు రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఉమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం వాహనం సేవలందిస్తుందని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. మహిళా రక్షణ, భద్రత కోసం ప్రభుత్వం ఉమెన్‌ డ్రాప్‌ ఎట్‌ హోం వాహన సేవలు ప్రారంభించామని, ఈ వాహనం జిల్లా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానమై ఉంటుందన్నారు. మహిళలు, విద్యార్థులు అత్యవసర సమయం, రాత్రి వేళల్లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. అత్యవసర సమయంలో 9494933233, 9490763489 నంబర్లకు ఫోన్‌ చేసి సాయం పొందాలని కోరారు.

Updated Date - 2021-12-08T05:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising