ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ ధరించకుంటే రూ.100 జరిమానా!

ABN, First Publish Date - 2021-04-22T06:24:17+05:30

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో సంచరించే వ్యక్తులందరూ విధిగా ముక్కు, నోరు కవరయ్యేట్టు మాస్క్‌ ధరించాలని, ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి రూ.100 జరిమానా విధించాలని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి పోలీసు, మున్సిపల్‌, పంచాయతీ అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), ఏప్రిల్‌21: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో సంచరించే వ్యక్తులందరూ విధిగా ముక్కు, నోరు కవరయ్యేట్టు మాస్క్‌ ధరించాలని, ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి రూ.100 జరిమానా విధించాలని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి పోలీసు, మున్సిపల్‌, పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈమేరకు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల నియంత్రణకు వైద్య, కుటుంబ సంక్షేమశాఖ జారీ చేసిన జీవో నంబరు 161 ఉత్తర్వులను జిల్లాలో ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్‌ స్పష్టంచేశారు. అలాగే బహిరంగ ప్రదేశాలు, ఇతర ఎస్టాబ్లిష్‌మెంట్లలో ప్రజలు ఐదు అడుగుల భౌతిక దూరం పాటించేటట్టు సంబంధిత ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఇన్‌చార్జిలు బాధ్యత వహించాలన్నారు. ఏదైనా పబ్లిక్‌ ప్రదేశం, ప్రాంగణంలో ఫిక్స్‌డ్‌గా బిగించిన సీట్లు ఉంటే సీటు విడిచి సీటు ఆల్టర్నేటివ్‌గా ఖాళీగా వదిలిపెట్టాలని ఆదేశించారు. ఫిక్సుడు సీట్లు కాని చోట్ల మధ్య ఐదు అడుగుల దూరం కచ్చితంగా అమలు చేయాలన్నారు. భౌతికదూరం పాటించడంతోపాటు ప్రజలు, సంస్థల సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లుఽ ధరించి హ్యాండ్‌ శానిటైజేషన్‌ పాటించాలన్నా రు. ప్రజలు రద్దీగా ఉండే షాపింగ్‌ ఏరియాలు, వాణిజ్య సంస్థలలో ధర్మల్‌ స్ర్కీ నింగ్‌, హ్యాండ్‌ శానిటైజేషన్‌, భౌతిక దూరం పాటింపు విధిగా అమలు చేయాలన్నారు. అలాగే జిల్లాలోని అన్ని స్విమ్మింగ్‌పూల్‌లను తక్షణం మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసు, మున్సిపల్‌, పంచాయతీ అధికారులు ఈ ఉత్త ర్వులను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ కోరారు.

Updated Date - 2021-04-22T06:24:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising