ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుపు రేషన్‌ కార్డుదారులకు కూపన్లు

ABN, First Publish Date - 2021-03-02T05:51:12+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు చేర్చేందుకు తెలుపు రేషన్‌ కార్డుదారులకు కూపన్లు ఇవ్వనున్నట్టు ఆర్డీవో శీనానాయక్‌ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంపచోడవరం, మార్చి 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు చేర్చేందుకు తెలుపు రేషన్‌ కార్డుదారులకు కూపన్లు ఇవ్వనున్నట్టు ఆర్డీవో శీనానాయక్‌ చెప్పారు. సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో వివిధ శాఖల సెక్టారు అధికారులతో ఆయన ఏపీవో పీవీఎస్‌ నాయుడుతో కలిసి సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా రేషన్‌ సరుకులు తరలించి సరఫరా చేస్తామన్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో వెలుగు విభాగం ద్వారా మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి లోన్ల మంజూరుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత ఏడాది రైతు భరోసా పొందని లబ్ధిదారుల జాబితాను సమర్పించాలని సూచించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆరో తరగతి విద్యార్థులు మధురపూడి విమానాశ్రయం సందర్శించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఐటీడీఏ పీవో ఆదేశించారని చెప్పారు. పోలవరం నిర్వాసిత గ్రామాలకు సత్యసాయి తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం నిర్వహించిన ప్రజావాణిలో 50 అర్జీలు అందా యని ఆర్డీవో తెలిపారు. కార్యక్రమంలో డీడీ ఎం.సరస్వతి, పశుసంవర్ధకశాఖ డీడీ రమేష్‌నాయక్‌, డీఎల్‌పీవో ఎన్‌.హరినాథ్‌బాబు, ఈఈలు శ్రీనివాసరావు, విశ్వనాధరెడ్డి, పీహెచ్‌వో వై.సత్యనారాయణ, జీసీసీ డీఎం ఎం.జగన్నాధరెడ్డి, ఏడీఏలు రత్నకుమార్‌, శ్యామల, డీఈలు పద్మనాభం, రాజేంద్రబాబు, కృష్ణారాజా, ఎండీ మెహు ద్దీన్‌, దుర్గాప్రసాద్‌, తహశీల్దారు కె.లక్ష్మీకళ్యాణి, ఎంపీడీవో ఎ.లక్ష్మీరెడ్డి, సీడీపీవో క్రాంతికుమారి, వైద్యాధికారులు కార్తిక్‌, రాజ్‌కుమార్‌, ఎస్‌వో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T05:51:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising