ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటరు జాబితాలో అవకతవకలు

ABN, First Publish Date - 2021-11-06T05:43:16+05:30

మండలంలోని రాజవొమ్మంగిలో 2వ వార్డుకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల జాబితాలో 2వ వార్డుకు చెందిన ఓటర్లను తొలగించి 14వ వార్డులో ఓ వర్గానికి చెందిన 70మంది ఓటర్లను 2వ వార్డులో కలపడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని టీడీపీ అరకు పార్ల మెంట్‌ ఉపాధ్యక్షుడు దంతులూరి శివరామచంద్రరాజు అరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టీడీపీ అరకు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు శివరామచంద్రరాజు

రాజవొమ్మంగి, నవంబరు 5: మండలంలోని రాజవొమ్మంగిలో 2వ వార్డుకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల జాబితాలో 2వ వార్డుకు చెందిన ఓటర్లను తొలగించి 14వ వార్డులో ఓ వర్గానికి చెందిన 70మంది ఓటర్లను 2వ వార్డులో కలపడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని టీడీపీ అరకు పార్ల మెంట్‌ ఉపాధ్యక్షుడు దంతులూరి శివరామచంద్రరాజు అరోపించారు. గత పంచాయతీ ఎన్నికల్లో రాజవొమ్మంగి 2వ వార్డు అభ్యర్థిగా విజయం సాధించిన గొల్లపూడి పెద్దిరాజు తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికలో పోటీ చేసి విజయం సాధించడంతో 2వ వార్డులో ఎన్నిక జరగనుంది. శుక్రవారం వైసీపీ, టీడీపీల మద్దతుతో ఐదుగురు నామినేషన్లు వేశారు. అనంతరం టీడీపీ మద్దతుతో నామినేషన్‌ వేసిన ఈక అచ్చిరాజు ఓటరు జాబితా పరిశీలించి ఒక వర్గానికి అనుకూలంగా ఓటరు జాబితాను మార్చడంపై రిటర్నింగ్‌ అధికారి, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశాడు. గతంలో 2వ వార్డు మెంబరు గొల్లపూడి పెద్దిరాజు మాట్లాడుతూ పాత ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నిక నిర్వహించాలని, న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. శివరామచంద్రరాజు మాట్లాడుతూ ఇటువంటి అవకతవకలకు పాల్పడుతూ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

Updated Date - 2021-11-06T05:43:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising