ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-03-03T07:03:01+05:30

భానుగుడి (కాకినాడ), మార్చి 2: నాయకులు జెండాలను, అజెండాలను పక్కన పెట్టి ఈనెల 5న నిర్వహించే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపునిచ్చింది. గాంధీభవన్‌లో మంగళవారం ప్రజా సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశా

కాకినాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపు

భానుగుడి (కాకినాడ), మార్చి 2: నాయకులు జెండాలను, అజెండాలను పక్కన పెట్టి ఈనెల 5న నిర్వహించే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపునిచ్చింది. గాంధీభవన్‌లో మంగళవారం ప్రజా సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల అజయ్‌కుమార్‌ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సం ఘాలు, రాజకీయ నేతలు బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు, ప్రజాసంఘాల నాయకులు గదుల సాయిబాబు, జె.వెంకటేశ్వర్లు, తాళ్లూరి రాజు, ఆకుల రమణ, ముమ్మి బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి ఆదాయం తీసుకువచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారన్నారు. ప్రతి రూపాయికి కేంద్రంపై ఆధారపడాలనే కుట్రతో రాష్ట్రాల హక్కులపై దాడి చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సొమ్ముతో 22 వేల ఎకరాల్లో నిర్మించుకున్న 3 లక్షల కోట్లు విలువ చేసే విశాఖ ఉక్కు పరిశ్రమను కేవలం రూ.6 వేల కోట్లకు దక్షిణ కోరియా కంపెనీ పోస్కోకు అమ్మేయడం దేశ విద్రోహ చర్యగా అభివర్ణించారు. ప్రజలందరూ 5న బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వామపక్ష నాయకులు టి.రాజా, జి.బేబీరాణి, నూకరాజు, చంద్రమళ్ల పద్మ, కె.సత్తిరాజు, పీఎస్‌ నారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-03T07:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising