ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీ మోడలింగ్‌ పేరుతో దొంగ బైక్‌లు డెలివరీ

ABN, First Publish Date - 2021-08-25T05:36:11+05:30

కొత్తపల్లి, ఆగస్టు 24: విశాఖకు చెందిన బైక్‌ మెకానిక్‌ రీ మోడలింగ్‌ పేరుతో 18 దొంగిలించిన బైక్‌లను డెలివరీ ఇచ్చిన సంఘటన కొత్తపల్లిలో మండలంలో జరిగింది. వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన వ్యక్తి బైక్‌లను రీ మోడలింగ్‌ చేస్తామని ఉప్పాడకు చెందిన వ్యక్తికి పరిచయమ్యాడు. ఆ వ్యక్తికి చెందిన పాడైన బైక్‌ను కొత్తబైక్‌గా తయారు చేసి డెలివరీ ఇచ్చాడు. ఇందుకుగాను పాత బైక్‌ ఇచ్చి మరో రూ. 20 వేలు మె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

18 బైక్‌లను స్వాధీనం చేసుకున్న గాజువాక పోలీసులు

కొత్తపల్లి, ఆగస్టు 24: విశాఖకు చెందిన బైక్‌ మెకానిక్‌ రీ మోడలింగ్‌ పేరుతో 18 దొంగిలించిన బైక్‌లను డెలివరీ ఇచ్చిన సంఘటన కొత్తపల్లిలో మండలంలో జరిగింది. వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన వ్యక్తి బైక్‌లను రీ మోడలింగ్‌ చేస్తామని ఉప్పాడకు చెందిన వ్యక్తికి పరిచయమ్యాడు. ఆ వ్యక్తికి చెందిన పాడైన బైక్‌ను కొత్తబైక్‌గా తయారు చేసి డెలివరీ ఇచ్చాడు. ఇందుకుగాను పాత బైక్‌ ఇచ్చి మరో రూ. 20 వేలు మెకానిక్‌ చెల్లించాలనే నిబంధనల మేరకు కొత్తపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 17మంది తమ బైక్‌లను మోడలింగ్‌ చేసుకునేందుకు విశాఖ మెకానిక్‌కు అప్పగించారు. దాంతో ఆయా బైక్‌కు చెందిన వ్యక్తులు తలో రూ.15వేలు, రూ.20 వేలు చార్జీలు చెల్లించి అందమైన బైక్‌లను డెలివరీ తీసుకున్నారు. కానీ ఆ మెకానిక్‌ రీ మోడలింగ్‌ పేరుతో పాత బైక్‌లను తీసుకొని దొంగిలించిన బైక్‌లకు పాత బైక్‌ల నెంబర్లు, ఛాసీస్‌ నెంబర్లు కొట్టించి అనుమానం రాకుండా చేశాడు. ఇటీవల విశాఖ మెకానిక్‌ కదలికలపై నిఘా వేసిన గాజువాక పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో తీగలాగితే డొంక కదలిన చందాన ఎక్కడెక్కడ ఎన్ని బైక్‌లు దొంగిలించాడు? ఎన్ని బైక్‌లు డెలివరీ ఇచ్చాడో పూర్తిగా సమాచారం ఇచ్చాడు మెకానిక్‌. కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు 18 బైక్‌లను డెలివరీ ఇచ్చినట్టు మెకానిక్‌ చెప్పడంతో వారి ఫోన్‌ ఆధారంగా విషయం చెప్పి బైక్‌లను గాజువాక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత బైక్‌తో పాటు డబ్బులు పోయి, మోడలింగ్‌ చేయించుకొన్న బండి పోవడంతో పలువురు లబోదిబోమంటున్నారు.

Updated Date - 2021-08-25T05:36:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising