ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రేపు రాష్ట్ర బంద్‌

ABN, First Publish Date - 2021-03-04T06:47:38+05:30

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కోనసీమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల5న చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, మార్చి 3: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను  నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కోనసీమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల5న చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. పోరాట సమితి నాయకులు కొప్పుల సత్తిబాబు, కారెం వెంకటేశ్వరరావు, అయితాబత్తుల సుభాషిణి, పచ్చిమాల వసంతకుమార్‌ల ఆధ్వర్యంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులను, గోల్డ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌, హోటల్‌ అసోసియేషన్‌, లారీ అసోసియేషన్‌, ఆర్టీసీ డిపో మేనేజర్‌ టీవీఎస్‌ సుధాకర్‌లను కలుసుకుని బంద్‌ను విజయవంతం చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు జల్లి శ్రీను, నిమ్మకాయల సురేష్‌, నిమ్మకాయల శ్రీనివాస్‌, ఉల్లింగి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రబంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు ది అసోసియేషన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, చాంబర్‌ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్ష, కార్యదర్శులు గోకరకొండ హరిబాబు, ఎన్‌ఎస్‌ మూర్తిలు  ఒక ప్రకటనలో తెలిపారు. 


Updated Date - 2021-03-04T06:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising