ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భోగాపురంలో విజిలెన్స్‌ తనిఖీలు

ABN, First Publish Date - 2021-06-23T04:36:39+05:30

పిఠాపురం రూరల్‌, జూన్‌ 22: మండలంలోని భోగాపురంలో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించి రూ.7.75 లక్షల విలువైన ఎరువులు, పురుగుల మందులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రభుత్వం నిషేధించిన పురుగు మందులు ఉన్నాయి.

భోగాపురంలో ఎరువులు, పురుగుల మందుల దుకాణంలో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.7.75 లక్షల విలువైన ఎరువులు, పురుగుల మందులు స్వాధీనం

గుర్తింపు, బిల్లులు లేకుండానే నిషేధిత మందుల విక్రయం

పిఠాపురం రూరల్‌, జూన్‌ 22: మండలంలోని భోగాపురంలో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించి రూ.7.75 లక్షల విలువైన ఎరువులు, పురుగుల మందులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రభుత్వం నిషేధించిన పురుగు మందులు ఉన్నాయి. పలు మందులపై అనుమానంతో పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతున్నారు. విజిలెన్స్‌ ఎస్పీ రవిప్రకాష్‌ ఆదేశాలతో లలితా ఆగ్రో ఏజెన్సీ్‌సపై సీఐ సత్యకిషోర్‌, ఇతర అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రికార్డులు, నిల్వలు, స్టాకు రిజిస్టర్లు, బిల్లు, ఇన్‌వాయి్‌సలను పరిశీలించారు. రికార్డులు సరిగా లేకపోవడంతో పలు రకాలు ఎరువులు, పురుగుమందులకు బిల్లులు లేనట్లు, ప్రభుత్వం నిషేధించిన పురుగు మందులను విక్రయిస్తున్నట్టు గుర్తించారు. అనధికారికంగా, స్టాకు రిజిస్టర్‌ నిర్వహించకుండా విక్రయిస్తున్న రూ.1,31,119 విలువైన ఆరు రకాల ఎరువులను స్వాధీనం చేసుకుని 6(ఎ) కేసు నమోదు చేశారు. జేసీ కోర్టులో కేసు ఫైల్‌ చేయనున్నారు. షాపులో ప్రభుత్వం నిషేధించిన గ్లైసోసైట్‌ అమోనియం కలుపుమందు 395 లీటర్లు గుర్తించారు. సుమారు రూ.4 లక్షల మందులను సీజ్‌ చేశారు. బిల్లులు లేకుండా, అనధికారికంగా నిల్వ ఉంచిన రూ.3.50 లక్షల విలువైన 28 రకాల పురుగుల మందులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొన్ని పురుగుమందులను నకిలీగా భావిస్తున్నారు. వీటి శాంపిల్స్‌ తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపారు. షాపు యజమాని అనంత వెంకటరమణపై కేసులు నమోదు చేసినట్టు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్‌ సీఐ సత్యకిషోర్‌తో పాటు ఎఫ్‌ఆర్‌వో షేక్‌ వలీ, ఏవో మహేష్‌ భార్గవ, వీరబాబు, మండల వ్యవసాయాధికారి అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-23T04:36:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising