ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయాలు!

ABN, First Publish Date - 2021-10-08T07:18:44+05:30

ఇప్పటికే పెరిగిన విద్యుత్‌, ఇంధన, గ్యాస్‌ చార్జీలతోపాటు చివరకు చెత్తపై పన్నులతో సతమవుతున్న వేళ మూలిగేనక్కపై తాటిపండు పడిన చందాన ఇప్పుడు కూరగాయల ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పెరిగిన ధరలతో లబోదిబోమంటున్న సామాన్యులు 
  • పది రోజుల వ్యవధిలోనే పైపైకి

మండపేట, అక్టోబరు 7: ఇప్పటికే పెరిగిన విద్యుత్‌, ఇంధన, గ్యాస్‌ చార్జీలతోపాటు చివరకు చెత్తపై పన్నులతో సతమవుతున్న వేళ మూలిగేనక్కపై తాటిపండు పడిన చందాన ఇప్పుడు కూరగాయల ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రెండేళ్ల నుంచి కొవిడ్‌వల్ల బతుకులు దుర్భరం కాగా, ఇలాంటి సమయంలో నిత్యావసరాల ధరల పెంపుతోపాటు నిత్యం వాడే కూరగాయల ధరల పెరుగుదల కూడా భారంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలు, పంట దిగుబడులు లేకపోవడం దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. పది రోజుల కిందట మార్కెట్‌లో కూరగాయల ధరలకు, ఇప్పటికి కిలోకి పది నుంచి 20 రూ పాయల వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. రైతుబజారుకు, మార్కెట్‌కు మధ్య ధరలో తీవ్ర వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం మాలధారణ వేసుకునేవారు ఉండడం, పెళ్లిళ్ల సందడి వంటి కార్యక్రమాల వల్ల కూరగాయల వినియోగం అధికంగా ఉంటుంది. మార్కెట్‌కు కూరగాయల కోసం పది రోజుల కిందట రూ. 300 పట్టుకు వెళ్లినా సంచినిండా కూరగాయలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రూ.500కి సగం కూడా కూరలు రాని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 12,500 ఎకరాల్లో కూరగాయలు సాగుచేస్తున్నారు. ఇందులో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు కారణంగా 412 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని ఉద్యానశాఖాధికారులు వెల్లడించారు. వరదలు, ఆక స్మిక వర్షాల కారణంగా పంటలకు నష్టంవాటిల్లడం వల్ల కూరగాయల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దుంపకూరలు, బంగాళాదుంపలు, క్యా రెట్‌, చామదుంపల ధరలు కాస్తంత నిలకడగానే ఉన్నాయి. ఇక ఉల్లిపాయల ధర కూడా పెరిగాయి. పది రోజుల కిందట కిలో రూ.25 ఉంటే, ఇప్పుడు ఉల్లి కిలో రూ.40కి చేరింది. ఇక బీరకాయలు, చిక్కుళ్ల ధర కిలో రూ.50 నుంచి రూ.80కి  చేరింది. బెండకాయలు కిలో పది రూపాయల నుంచి కిలో రూ.30కి చేరింది. ఇక వంకాయలు కిలో రూ.30 నుంచి రూ.40కి చేరా యి. అలాగే టమెటా కిలో రూ.20 నుంచి రూ.30కి చేరింది. ములక్కాడ ఒకటి రూ.5 నుంచి పదికి చేరింది. క్యారెట్‌, బీట్‌రూట్‌ ధరలు కూడా కిలోకి పది వంతున పెరిగి రూ.30 నుంచి రూ.40కి చేరుకున్నాయి. బజారులో ఆకుకూరల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల నియంత్రణపై ప్రభుత్వ అధికారులు దృష్టిసారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-10-08T07:18:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising