ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందని ఆకుకూరలు

ABN, First Publish Date - 2021-09-30T07:01:41+05:30

ఆకుకూరల ధరలకు రెక్కలొచ్చాయి. సామర్లకోట, పెద్దాపురం పరిసరాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆకుకూరల పంటలు పూర్తిగా నీట మునిగి కుళ్లి పోవడం, నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడం వల్ల ఆకుకూరలు అందుబాటులో లేకపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధిక వర్షాలతో పంటలు నాశనం 

రెట్టింపు స్థాయికి చేరిన ధరలు

సామర్లకోట, సెప్టెంబరు 29: ఆకుకూరల ధరలకు రెక్కలొచ్చాయి. సామర్లకోట, పెద్దాపురం పరిసరాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆకుకూరల పంటలు పూర్తిగా నీట మునిగి కుళ్లి పోవడం, నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడం వల్ల ఆకుకూరలు అందుబాటులో లేకపోయాయి. సామర్లకోట, పెద్దాపురం సంతమార్కెట్లు, రోజూవారీ మార్కెట్లలో ఆకుకూరల దిగుమతులు తగ్గి పోయాయి. దీంతో సహజంగానే ఆకుకూరల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పది రూపాయలు మూడు కట్టలు వచ్చే తోటకూర ఇప్పుడు రూ.20కి పెరిగింది. కొత్తిమీర కట్ట అదే రీతిన రూ.20కి చేరింది. ఇక గోంగూర, బచ్చలి, చుక్కకూర, పాలకూర, పుదీనా, కరివేపాకులతోబాటు  దివ్యఔషధ గుణాలున్న పొన్నగంటి కూర, కొండపిండి ఆకుకూరల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. దీంతో సామాన్యులే కాకుండా మద్యతరగతికి చెందినవారు సైతం ఆకుకూరలు కొనుగోలు చేయాలంటే బెంబేలెత్తుతున్నారు. ఆకుకూరల పంటలు భారీవర్షాల కారణంగా పాడై నందున తిరిగి పంట చేతికందేవరకూ నెలరోజులపాటు ధరలు ఇదే రీతిన ఉండొచ్చు.



Updated Date - 2021-09-30T07:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising