ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ వేసి ప్రాణాలు కాపాడండి

ABN, First Publish Date - 2021-05-09T05:50:39+05:30

కొవిడ్‌ వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ లేక ప్రజలు మృత్యువాత పడుతున్నా, పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడం దారుణం. వెంటనే 18ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ వేసి ప్రాణాలు కాపాడాలని డిమాండ్‌ చేస్తూ గుడా మాజీ చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ డిమాండ్‌ చేశారు.

రాజమహేంద్రవరంలో నిరసన తెలుపుతున్న నవీన్‌కుమార్‌, రవియాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టీడీపీ నేత గన్ని కృష్ణ.. ప్లకార్డులతో పార్టీ నాయకుల నిరసనలు

 రాజమహేంద్రవరం, మే 8(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌ లేక  ప్రజలు మృత్యువాత పడుతున్నా, పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడం దారుణం. వెంటనే 18ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ వేసి ప్రాణాలు కాపాడాలని డిమాండ్‌ చేస్తూ గుడా మాజీ చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపు మేరకు జిల్లాలో పలువురు పార్టీ నాయకులు శనివారం ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. రాజమహేంద్రవరంలోని తన స్వగృహంలో గన్ని కృష్ణ ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. కరోనా తీవ్రతను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం కోటి వ్యాక్సిన్ల కొనుగోలుకు సింగిల్‌ పేమెంట్‌ విధానంలో ఒప్పందం చేసుకుందని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం కేవలం 14లక్షల వ్యాక్సిన్లకు ఆర్డర్‌ ఇవ్వడం దౌర్భాగ్యమన్నారు. సుదీర్గ రాజకీయ అనుభవమున్న చంద్రబాబు సూచనలు పాటించకుండా ఆయనపై క్రిమినల్‌ కేసులు పెట్టడం సరికాదని గన్ని కృష్ణ అన్నారు. 

Updated Date - 2021-05-09T05:50:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising