ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ఉగాది సంబరాలు

ABN, First Publish Date - 2021-04-14T06:00:43+05:30

అన్నవరం, ఏప్రిల్‌ 13: జిల్లావ్యాప్తంగా శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవా రం ఘనంగా జరిగాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అలాగే వివిధ వేదికల మీద పం చాంగ శ్రవణాలు అత్యంత వేడుకగా నిర్వహించారు. పండితులను, సాహితీవేత్తలు,

ప్రత్యేక వేదికపై ఆశీనులైన స్వామి అమ్మవార్లు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో అలరించిన పంచాంగ శ్రవణం

స్వామివారి ఆదాయం 2.. వ్యయం 14   

దీంతో భక్తులకు మరిన్ని సేవలు

అన్నవరం, ఏప్రిల్‌ 13: జిల్లావ్యాప్తంగా శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు మంగళవా రం ఘనంగా జరిగాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అలాగే వివిధ వేదికల మీద పం చాంగ శ్రవణాలు అత్యంత వేడుకగా నిర్వహించారు. పండితులను, సాహితీవేత్తలు, కవులను సత్కరించుకున్నారు. ముఖ్యంగా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 8 గంటలకు సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మ వార్లను ఉంచి ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవ స్థానం విశ్రాంత వ్రత బ్రహ్మ పాలంకి పట్టాభిరామ్మూర్తి పంచాంగ శ్రవణం పఠించారు. మఖనక్షత్ర జాతకుడు అయిన స్వామివారికి ఈ ఏడాది ఆదాయం 2, వ్యయం 14గా అభివర్ణించారు. ఫలితంగా భక్తులకు మరిన్ని సౌకార్యాలు సమకూరుతాయన్నారు. అనంతరం ఈవో త్రినాఽథరావు దేవస్థానం తరపున ముగ్గురు పండితులను సత్కరించారు. అనంతరం చతుర్వేద పండితులు వేదాశ్వీరచనాలు అందజేసి ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఇక ఈ ఏడాది ఉగాది వేడుకల్లో పుష్పాలంకరణలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. స్వామి దర్శనానికి నూతన సంవత్సరవేళ అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దర్శనానాంతరం భక్తులు పుష్పాలంకారణ మధ్య స్వీయ చిత్రాలు దిగారు. అటు ఉగాది పర్వదినం సందర్భంగా వెండి రథ సేవను ఉదయం 10 గంటలకు నిర్వహించారు. వెండిరథంపై స్వామి అమ్మవార్లను ఆశీనులు గావించి ముమ్మారు ప్రదక్షిణ చేయించారు. ఈ కార్య క్రమంలో నాగభట్ల కామేశ్వరశర్మ, వ్రత పురోహిత సంఘం అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మ, సహయ కమిషనర్‌ రమేష్‌బాబు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-14T06:00:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising