ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN, First Publish Date - 2021-12-02T05:35:00+05:30

తుని, డిసెంబరు 1: వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని తుని నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు అన్నా రు. టీడీపీ ఆత్మగౌరవ సభలో భాగంగా తుని మండలం తాళ్లూరు, మరువాడ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు

తాళ్లూరులో మాట్లాడుతున్న యనమల కృష్ణుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు

తుని, డిసెంబరు 1: వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని తుని నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు అన్నా రు. టీడీపీ ఆత్మగౌరవ సభలో భాగంగా తుని మండలం తాళ్లూరు, మరువాడ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజు ల్లో జుట్టుపై కూడా పన్ను వేసే పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లపై గృహహక్కు పథకం పేరుతో దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. పేదలు డబ్బులు కట్టవద్దని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి చంద్రబాబు అప్పగిస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తాండవ షుగర్స్‌ మాజీ చైర్మన్‌ సుర్ల లోవరాజు, టీడీపీ మండలాధ్యక్షుడు అప్పన రమేష్‌, గాది వరహాలబాబు, తమరాన కృష్ణ, సుర్ల సూరిబాబు, యడ్ల సత్యనారాయణ, వియ్యపు జోగిరాజు, ఆవుగడ్డి వెంటకరమణ, యర్ర లోవరాజు, మాణి క్యం సుబ్బారావు, షేక్‌ మదీనావల్లీ, కొల్లు బుజ్జి, కురందా సు రమణ, రామునాయుడు, షేక్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.


న్యాయ పోరాటం చేస్తాం: జ్యోతుల

జగ్గంపేట, డిసెంబరు 1: ప్రజా సంక్షేమ పథకాల్లో కోత విధిస్తే న్యాయ పోరాటం చేస్తామని జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఇర్రిపాకలోని తన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘జగనన్న విద్యా కానుక’ పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి పేర్లు మార్చి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయ డం వల్ల వారు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. ప్రభు త్వ పరిస్థితిని చూసి ఏడవాలో నవ్వాలో తెలియని పరిస్థితుల్లో మహిళలు ఉన్నారన్నారు. వాళ్లంతా పొదుపు చేసుకున్న రూ.2,200 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని నెహ్రూ విమర్శించారు. 

Updated Date - 2021-12-02T05:35:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising