ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

45 రోజుల్లో టిడ్కో ఇళ్లు అప్పగించకుంటే ఉద్యమం

ABN, First Publish Date - 2021-09-19T05:34:18+05:30

ఏపీ టిడ్కో గృహాలను 45 రోజుల్లో లబ్ధిదారులకు అప్పగించకపోతే ఉద్యమం చేపడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు ఆదిరెడ్డి వాసు, యర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కు మార్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 18: ఏపీ టిడ్కో గృహాలను 45 రోజుల్లో లబ్ధిదారులకు అప్పగించకపోతే ఉద్యమం చేపడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు ఆదిరెడ్డి వాసు, యర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కు మార్‌ హెచ్చరించారు. స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద శనివారం టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ధర్నా చేశారు. ఎమ్మెల్యే భవాని మాట్లాడుతూ రాజమ హేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 6544 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి టిడ్కో ఇళ్లలో బ్లాక్‌లతో సహ ప్లాట్లు కేటాయించారని, అయితే వాటిని ఇప్పటికీ అప్పగించకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఇళ్లు అప్పగిం చకపోతే తామే లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. ఆదిరెడ్డి వాసు, యర్రా వేణుగోపాలరాయుడు, కాశి నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని, అవి ప్రభు త్వానికి పట్టడం లేదన్నారు. సీఎం చెప్పేవన్నీ అబద్ధాలని, ఆయనకు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెబుతారని విమర్శించారు. అనంతరం వారు కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ పార్లమెంట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, మహిళా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్‌, మాజీ కార్పొరేటర్లు ద్వారా పార్వతి సుందరి, కొయ్యల రమణ, కడితి జోగారావు, రాచపల్లి ప్రసాద్‌, కొసూరి చండిప్రియ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T05:34:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising