ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్నేహితుడిని బంధించి.. సముద్రతీరానికి వచ్చిన యువతిపై.. ముగ్గురు యువకులు కలిసి..

ABN, First Publish Date - 2021-05-14T15:39:32+05:30

స్నేహితునితో కలిసి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం

తీరంలో సంఘటనపై డీఎస్పీ విచారణ


అల్లవరం(తూర్పు గోదావరి): స్నేహితునితో కలిసి కొమరగిరిపట్నం సముద్రతీరానికి వచ్చిన ఓ యువతిపై మద్యం సేవించిన ముగ్గురు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలో ఒక గ్రామానికి చెందిన 21ఏళ్ల యువతి 15 రోజుల క్రితం తన స్నేహితుడితో కలసి అల్లవరం మండలం కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్ర తీరానికి వెళ్లింది. మద్యం తాగి అప్పటికే ఆ తీర ప్రాంతంలో ఉన్న కొమరగిరిపట్నం సీతారామపురానికి చెందిన ముగ్గురు యువకులు వారి వద్దకు వెళ్లి యువతి స్నేహితుడిని బంధించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది.


అత్యాచారం అనంతరం నగ్నంగా ఉన్న యువతి ఫొటోలను తీసి ఆమెను బెదిరించినట్టు ఆరోపణ. పది రోజుల తరువాత ఓ వ్యక్తి మళ్లీ తన కోరిక తీర్చాలని, లేకుంటే నగ్న చిత్రాలను సామాజిక మాద్యమంలో పెడతానంటూ బెదిరించారని ఆ యువతి బంధువులకు చెప్పుకుంది. దీంతో యువతి బుధవారం అల్లవరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ బి.ప్రభాకరరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి, రూరల్‌ సీఐ జి.సురేష్‌బాబు, అల్లవరం ఎస్‌ఐ బి.ప్రభాకరరావు స్థానిక వీఆర్వోతో కలసి కొమరగిరిపట్నం తీరంలో సంఘటన జరిగిన ప్రాంతాన్ని గురువారం సందర్శించారు. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అత్యాచార బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం అమలాపురం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

Updated Date - 2021-05-14T15:39:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising