ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యసనాలతో నేరాల బాట

ABN, First Publish Date - 2021-05-09T05:23:12+05:30

విలాసాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన నలుగురు యవకులు చోరీల బాట పట్టి చివరికి కటకటాలపాలయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నలుగురి యువకుల అరెస్టు

పెద్దాపురం, మే 8: విలాసాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన నలుగురు యవకులు చోరీల బాట పట్టి చివరికి కటకటాలపాలయ్యారు.  కాకినాడ సీసీఎస్‌ డీఎస్పీ ఎస్‌.రాంబాబు శనివారం వివరాలు వెల్లడించారు. రాత్రి సమయాల్లో ఏడీబీ రహదారిలో దారి కాచి దోపిడీలకు పాల్పడుతున్న కాకినాడకు చెందిన చల్లా నాగశివ మణికంఠ అలియాస్‌ చిప్పూ నాని, ఏనుగుపల్లి రాజు అలియాస్‌ అభయ్‌, మద్దాల ఉదయ్‌కుమార్‌ అలియాస్‌ ఉదయ్‌, తణుకు దుర్గాప్రసాద్‌ అలియాస్‌ మేకల సూర్య విలాసాలు, వ్యసనాలకు అలవాటు పడి చోరీల బాటపట్టారు. తక్కువ సమయంలో డబ్బు లు సంపాదించాలని అడ్డదారులు తొక్కారు. ఈనెల 1న పెద్దాపురం ఏడీబీ రహదారిలో రాత్రి ఒంటిగంట సమయంలో నలుగురు నిందితులు పెట్రోలు బంకులోకి ప్రవేశించి అక్కడ పనిచేసే సిబ్బందిని కత్తులతో  బెదిరించి చోరీకి యత్నించారు. సిబ్బంది ప్రతిఘటించడంతో భయపడి మోటార్‌ సైకిల్‌ను వదిలి పరారయ్యారు. పెద్దాపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితులు పాల్పడిన మరికొన్ని నేరాలకు సంబంధించిన విషయాలు వెలుగు చూశాయి. ఇటీవల సర్పవరంలో చెట్ల సత్యప్రసాద్‌ అనే వ్యక్తిని మోటార్‌సైకిల్‌ విషయంపై ఇనుపరాడ్డుతో తలపై బలంగా మోది గాయపరిచారు. అతడు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. దీనిపై సర్పవరం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. అలాగే రాజానగరంలో ఓ ఇంట్లోకి ప్రవేశించి బంగారు నగలు, నగదు దోచుకుపోయారు. దీనిపై రాజానగరం పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. దొంగిలించిన సొమ్ములతో జల్సాలు చేశారు. మర్డర్‌ కేసు నుంచి బయటపడేందుకు బెయిల్‌ మంజూరుకు డబ్బులు సరిపడక పెట్రోలు బంకులో చోరీకి యత్నించారు. దీంతో పెద్దాపురం పోలీసులకు అందిన సమాచారం మేరకు వారిని పెద్దాపురం మండలం కొండపల్లిలో ఓ కోళ్ల ఫారం వద్ద  అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నుంచి కత్తులు, ఇనపరాడ్డు, బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, గ్లామర్‌ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ చెప్పారు. నిందితులను కోర్టుకు తరలించనున్నట్టు చెప్పారు. కేసును చాకచక్యంగా చేధించిన సీఐ జయకుమార్‌, ఎస్‌ఐ బాలాజీ తదితర సిబ్బందిని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ అభినందించారు.

Updated Date - 2021-05-09T05:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising