ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువెంపు జాతీయ పురస్కారానికి తెలుగు రచయిత్రి సత్యవతి ఎంపిక

ABN, First Publish Date - 2021-12-15T07:06:36+05:30

ప్రముఖ తెలుగు రచ యిత్రి పీ సత్యవతి 2021 సంవత్స రానికిగాను కువెంపు జాతీయ పుర స్కారానికి ఎంపికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ తెలుగు రచ యిత్రి పీ సత్యవతి 2021 సంవత్స రానికిగాను కువెంపు జాతీయ పుర స్కారానికి ఎంపికయ్యారు. ఈనెల 29న కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా కుప్పళ్లిలో జరిగే మహాకవి కువెంపు జయంతి కార్యక్ర మంలో ఆమెకు ఈ ప్రతిష్టాత్మక పుర స్కారం అందజేసి గౌరవించనున్నా రు. పురస్కారం కింద రూ.5 లక్షల నగదు, వెండిపతకం అందజేస్తారు. కాకినాడకు చెందిన సత్యవతి తన కథలు, నవలల ద్వారా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని, సాహిత్య రంగానికి ఆమె చేసిన సేవ లను గుర్తించి ఈ పురస్కారం కోసం ఎంపిక చేశామని కువెంపు ట్రస్టు అధ్యక్షుడు ప్రముఖ సాహితీవేత్త హంప నాగరాజయ్య బెంగళూరులో మంగళవారం ఆంధ్రజ్యోతికి చెప్పారు. పురస్కార ఎంపిక కమిటీలో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్‌ కే శ్రీనివాసరావ్‌, ప్రముఖ రచయిత ఘట్టమరాజు అశ్వత్థనారాయణ, నాట క రంగ కళాకారుడు కేవై నారాయణ స్వామి తదితర ప్రముఖులున్నారు.



Updated Date - 2021-12-15T07:06:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising