ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలి

ABN, First Publish Date - 2021-05-11T04:40:57+05:30

ఉపాధ్యాయులందరినీ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి వయస్సుతో సంబంధం లేకుండా వ్యాక్సిన్‌ వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పీఆర్‌టీయూ రాయవరం మండల శాఖ అధ్యక్షుడు పి.విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయవరం, మే 10: ఉపాధ్యాయులందరినీ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి వయస్సుతో సంబంధం లేకుండా వ్యాక్సిన్‌ వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పీఆర్‌టీయూ రాయవరం మండల శాఖ అధ్యక్షుడు పి.విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. పీఆర్‌టీయూ మండల శాఖ సమావేశం జూమ్‌ యాప్‌ ద్వారా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉపాధ్యాయలు కరోనా బారిన పడి మరణించారని స్కూల్స్‌ పునఃప్రారంభించేలోపు ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్‌ వేయాలన్నారు. కరోనా బారిన పడిన ఉపాధ్యాయులందరికీ 21 రోజలు క్యాజువల్‌ లీవ్‌ ఇవ్వాలన్నారు. రిపోర్టు ఆధారంగా డాక్టర్‌ సర్టిఫికెట్‌తో సంబంధం లేకుండా మెడికల్‌ లీవ్‌ మంజూరు చేయాలని, ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక కొవిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. కరోనాతో మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రూ.50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటరెడ్డి, సీహెచ్‌ ప్రదీప్‌కుమార్‌, పీఆర్‌కే బాపూజీ, గుంటూరి అప్పారావు, కె.గోవిందరాజు, పాపారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T04:40:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising