ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ ఓ బాధ్యతగా తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-03-07T07:05:03+05:30

ఉభయగోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరగబోయే ఎన్నికల నిర్వహణను పీవో, ఏపీవోలు బాధ్యతగా తీసుకుని పోలింగ్‌ విజయవంతం చేయడంలో కీలకంగా పనిచేయాలని ఎన్నికల పరిశీలకులు శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, పక్కన కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, డీఆర్వో సత్తిబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీవో, ఏపీవోల శిక్షణలో జిల్లా పరిశీలకులు శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ 
కాకినాడ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఉభయగోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరగబోయే ఎన్నికల నిర్వహణను పీవో, ఏపీవోలు బాధ్యతగా తీసుకుని పోలింగ్‌ విజయవంతం చేయడంలో కీలకంగా పనిచేయాలని ఎన్నికల పరిశీలకులు శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ సూచించారు. ఈమేరకు పీవో, ఏపీవోలకు శనివారం ఏర్పా టు చేసిన శిక్షణలో ఆయన పాల్గొని అధికారులకు దిశనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఏ స్థాయిలో జరిగినా అవి కీలకమేననే, పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ సమయంలో, తర్వాత దశల్లో బాధ్యులైన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎటువంటి చిన్న పొరపాటుకు తావివ్వకుండా జవాబుదారీగా పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తక్కువమంది ఓటర్లే కదా అనే భావనతో నిర్లిప్తంగా వ్యవహరించవద్దన్నారు. హ్యాండ్‌ బుక్‌లో ఉన్న సమాచారాన్ని అవగాహన చేసుకుని ఎన్నికలు సజావుగా విజయవంతం చేయడంలో సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈనెల 14న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ప్లెయిన్‌ ఏరి యాలో, ఏజెన్సీలో మండలాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ మిగిలిన ఎన్నికలతో పోల్చి చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిబ్బంది వ్యవహరించాలన్నారు. డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, పెద్దాపురం ఆర్డీవో మల్లిబాబు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-07T07:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising