ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇవి రోడ్లా..?

ABN, First Publish Date - 2021-07-25T06:46:54+05:30

రహదారులపై పడవ ప్రయాణం చేసి, కొన్నిచోట్ల వరినాట్లు వేసి కోనసీమ టీడీపీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున నాయకులు తరలివచ్చారు.

జగ్గంపేటలో గుంతలు పడ్డ రహదారికి మరమ్మతులు చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అధ్వాన రహదారులపై టీడీపీ వినూత్న నిరసన
  • జగ్గంపేట, అనపర్తి, కొత్తపేట నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు

కొత్తపేట, జూలై 24: రహదారులపై పడవ ప్రయాణం చేసి, కొన్నిచోట్ల వరినాట్లు వేసి కోనసీమ టీడీపీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున నాయకులు తరలివచ్చారు. కొత్తపేట-అమలాపురం రోడ్డులో రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. అమలాపురం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అ నంతకుమారి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, ముమ్మిడివరం, మాజీ ఎమ్మెల్యేలు దాట్ల బుచ్చిబాబు, అయితాబత్తుల ఆనందరావు, మెట్ల రమణబాబు ప్రభుత్వ అసమర్ధ పాలనను ఎండగట్టారు. నాయకులు డొక్కానాధ్‌బాబు, పెచ్చెట్టి విజయలక్ష్మి, చిలువూరి సతీష్‌రాజు, తాడి నరసింహారావు, మోకా ఆనందసాగర్‌, దాట్ల బాబు, కరుటూరి నరసింహారావు, సయ్యపురాజు రామకృష్ణంరాజు, కంఠంశెట్టి శ్రీను పాల్గొన్నారు.

‘అసమర్దుల పాలనలో రాష్ట్రం’

అనపర్తి, జులై 24: రాష్ట్రంలో ఏ రోడ్డు చూ సినా గుంతలేనని, ఒక్క గుంతలో కూడా తట్ట మట్టి వేయలేని అసమర్ధుల పాలనలో రాష్ట్రం ఉందని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే నల్ల మిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అనపర్తి నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితిపై బిక్కవోలు మం డలం బలభద్రపురం రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జివద్ద టీడీపీ నాయకులు శనివారం ఆందోళన నిర్వహిం చారు. ఈ సందర్భంగా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రావెల్‌ను రోడ్డుపై ఉన్న గుంతలను బుచ్చయ్యచౌదరి, రామకృష్ణారెడ్డి గంపలతో నింపి నిరసన తెలిపారు. బ్రిడ్జిపై నుంచి పాదయాత్ర నిర్వహిస్తూ మహో ధర్నా నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, ఆళ్ల గోవిందు, జుత్తుగ కృష్ణ, వెలుగుబంటి సత్యనారాయణ, కర్రి వెంకటరామారెడ్డి, నల్లమిల్లి సుబ్బారెడ్డి, కొవ్వూరి వేణుగోపాలరెడ్డి, అచ్చిరెడ్డి పాల్గొన్నారు.

‘రాష్ట్రంలో రహదారులు అడుగడుగునా గుంతలమయం’

జగ్గంపేట/జగ్గంపేట రూరల్‌, జూలై 24: వైకాపా పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రోడ్ల దుస్థితిపై కాకినాడ పార్లమెంటరీ పరిధిలోని టీడీపీ నాయకులతో కలిసి ఆయన జగ్గంపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా జగ్గంపేట మండలంలోని రామవరం-ఇర్రిపాక వరకు అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్ధితిని పరిశీలిం చారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అధ్వానంగా ఉన్న రోడ్లపై తట్టమట్టి కూడా వేయలేని పరిస్ధితి ఉందన్నారు. రామవరం నుంచి ఇర్రిపాక వరకు ఉన్న రోడ్డుకు తమ సొంత నిధులు సమకూర్చి మరమ్మతులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జ్యోతుల నవీన్‌కుమార్‌, వరుపుల రాజా, యనమల కృష్ణుడు, సుంకర పావని, వనమాడి కొండబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T06:46:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising