ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మతసామరస్యానికి ప్రతీక ఉరుస్‌ గంధోత్సవం

ABN, First Publish Date - 2021-01-21T05:59:05+05:30

పెద్దాపురం, జనవరి 20: మతసామరస్యానికి ప్రతీక ఉరుస్‌ షరీఫ్‌ గంధోత్సవం అని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పట్ణణ శివారు పాతపెద్దాపురంలో ఉన్న హజరత్‌ షేక్‌ మదీనా పాచ్ఛా ఔళియా దర్గా వద్ద ఉరుస్‌ గంధోత్సవాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా

దర్గా వద్ద ప్రార్థన చేస్తున్న ఎమ్మెల్యే చినరాజప్ప
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప 

పెద్దాపురం, జనవరి 20: మతసామరస్యానికి ప్రతీక ఉరుస్‌ షరీఫ్‌ గంధోత్సవం అని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పట్ణణ శివారు పాతపెద్దాపురంలో ఉన్న హజరత్‌ షేక్‌ మదీనా పాచ్ఛా ఔళియా దర్గా వద్ద ఉరుస్‌ గంధోత్సవాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు మహ్మద్‌ లాయక్‌ ఆలీ తదితరులు ఆయనకు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజప్ప వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులు గంధాన్ని దర్గా వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సమాధికి గంధాన్ని పూశారు. ఈ సందర్భగా ఏర్పాటు చేసిన ఖురాన్‌ ఖానీ, ఖవ్వా లీ, ఫాతేహా ఖానీ కార్యక్రమాలు, మిమిక్రీ, మ్యాజిక్‌షో అలరించాయి. ఉత్సవానికి జనసేన ఇన్‌చార్జ్‌ తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకురాలు తుమ్మల పద్మజ హాజరయ్యారు. 

Updated Date - 2021-01-21T05:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising