ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రణాళికతో స్వచ్ఛ సంకల్పం

ABN, First Publish Date - 2021-10-21T06:51:11+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం 100 రోజుల పాటు జరగనున్నందున క్షేత్రస్థాయిలో పటిష్టమైన ప్రణాళిక సిదఽ్ధం చేసుకుని విజయవంతం చేయాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఆదేశించారు.

కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ హరికిరణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ హరికిరణ్‌
కాకినాడ సిటీ, అక్టోబరు 20: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం 100 రోజుల పాటు జరగనున్నందున క్షేత్రస్థాయిలో పటిష్టమైన ప్రణాళిక సిదఽ్ధం చేసుకుని విజయవంతం చేయాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి సబ్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్మీశ, చేకూరి కీర్తి, ఎ.భార్గవ్‌తేజలతో కలిసి కలెక్టర్‌ హరికిరణ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 25 నాటికి మండల స్థాయిలో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంపై స్థానిక ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీ, జడ్‌పీటీసీ, సర్పంచ్‌లతో ఒక వర్క్‌షాప్‌ నిర్వహించి స్థానిక వనరులపై సమీక్షించాలన్నారు. చెత్త సేకరణకు నూతనంగా జిల్లాకు కేటాయించిన 155 వాహనాలను చెత్త ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుకుని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌, సత్తిబాబు, డీఎంహెచ్‌వో కేవీఎస్‌ గౌరీశ్వరరావు, హౌసింగ్‌, డీఆర్‌డీఏ పీడీలు జి.వీరేశ్వరప్రసాద్‌, కె.శ్రీరమణి, జేడీఏ ఎన్‌.విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T06:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising