ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విగ్రహాల ధ్వంసం మంచి సంస్కృతి కాదు

ABN, First Publish Date - 2021-02-06T06:00:31+05:30

నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం, చెప్పుల దండలు వేసి అవమానించడం మంచి సంస్కృతి కాదని రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ జక్కంపూడి రాజా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కాపు కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ జక్కంపూడి రాజా 

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 5: నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం, చెప్పుల దండలు వేసి అవమానించడం మంచి సంస్కృతి కాదని రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ జక్కంపూడి రాజా అన్నారు. శుక్రవారం స్థానికంగా తన  కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దోసకాయలపల్లిలో మాజీ సీఎం ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ నాయకులు రాష్ట్రాభివృద్ధికి ఎన్నో సేవలు అందజేసి ఉన్నతస్థాయికి చేరుకుంటారని, అటువంటి నాయకుల విగ్రహాలు ధ్వంసం చేయడం విచారకరమని అన్నారు. కాగా విగ్రహం ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌ దిమ్మ బలంగా లేకపోవడంతో విగ్రహం కూలి ఉంటుందని కొందరు స్థానికులు చెబుతున్నారని, అయినా ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ నాళం రోశయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-06T06:00:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising