ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిలిచి గెలిచారు!

ABN, First Publish Date - 2021-02-27T07:00:37+05:30

పంచాయతీలు పల్లె ప్రగతికి పట్టుగొమ్మలు. పంచాయతీల పాలన సమర్థుల చేతుల్లో ఉంటే గ్రామాలు అభివృద్ధిబాటలో పయనిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పంచాయతీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన ఉన్నత విద్యావంతులు

 సర్పంచ్‌లుగా నెగ్గినవారిలో ఎంబీఏ, లా, బీటెక్‌ గ్రాడ్యుయేట్స్‌తోపాటు దంత వైద్యులు

 ఆ తర్వాత స్థానంలో అధికంగా గృహిణులు, రైతులు, కూలీలు, వ్యాపారులు

 విజేతల్లో అనేకమంది డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు అభ్యసించినవారే

 

 జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఈ దఫా ఉన్నత విద్యావంతులు అధికంగానే విజయ  బావుట ా ఎగురవేశారు. తొలి అడుగే విజయంతో ఆరంభించారు. రాజకీయాలంటే మనకెందుకులే అనే ఆలోచనను వీడి కొత్త పంఽథాలో పయనించారు. చివరకు పల్లెల్లో జరిగిన అసలు సిసలు రాజకీయ సమరంలో విజేతలుగా నిలిచారు. ఇలా కొత్తగా సర్పంచ్‌లుగా ఎన్నికైన వారిలో అనేకమంది ఎంబీఏ, లా, బీటెక్‌తో పాటు వైద్య విద్యనభ్యసించిన వారు ఉండడం విశేషం. వీరిలో అనేకమంది డాక్టర్లు, లాయర్లు,ఇంజనీర్లుగా తమ వృత్తుల్లో రాణిస్తూ ఇప్పుడు రాజకీయ నేతలుగా మారారు. సాధారణంగా సర్పంచ్‌ పదవి అంటే గ్రామంలో రాజకీయ నేత వారసులో, లేదా మోతుబరి రైతో పోటీపడతారనే భావన నాటుకుపోయింది. కానీ దీనికి భిన్నంగా పల్లెపదవుల్లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి వివిధ రంగాల్లో రాణిస్తున్నవారు నిలిచి గెలవడం విశేషం.


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

పంచాయతీలు పల్లె ప్రగతికి పట్టుగొమ్మలు. పంచాయతీల పాలన సమర్థుల చేతుల్లో ఉంటే గ్రామాలు అభివృద్ధిబాటలో పయనిస్తాయి. తాజాగా జిల్లాలో నాలుగు విడతల్లో 1,027 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 2,670 మంది సర్పంచ్‌లుగా పోటీపడ్డారు. ఇందులో రాజకీయ నేతలు, వ్యాపారులు, గృహిణులు, రైతులు, కూలీలు, ఉన్నత విద్యావంతుల వరకు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే విజేతలుగా గెలిచినవారిలో ఈ దఫా ఉన్నతవిద్యావంతులు, వివిధ రంగాల్లో వృత్తి నిపుణుల సంఖ్య ఎక్కువగా ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. దీంతో ఆయా పంచాయతీల్లో ఉన్నత విద్యావంతులైన సర్పంచ్‌లుగా వీరి పాలన ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మా రింది. వీరికున్న కొత్త ఆలోచనలతో పంచాయతీలను ఆదర్శంగా, వినూత్నంగా అభివృద్ధి బాటలో నడిపిస్తారనే అంచనాలు నెలకొన్నాయి. యు.కొత్తపల్లి మండలం కొమరగిరి సర్పంచ్‌గా ఎన్నికైన సత్యశ్రీ బీడీఎస్‌ చదివి దంతవైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఏలేశ్వరం మండలం ఈఎల్‌ పురం సర్పంచ్‌గా నెగ్గిన బార్గవి బీడీఎస్‌ వైద్యవిద్య ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. కె.గంగవరం మండలం పేకేరు సర్పంచ్‌గా ఎన్నికైన సందీప్‌ ఎంబీఏ చదివారు. ఇంటిపట్టునే వ్యవసాయం చేస్తున్న ఈయన ఇప్పుడు పంచాయతీ పెద్దగా బాధ్యతలు చేపట్టారు. మండపేట మండలం మెర్రిపాడు సర్పంచ్‌గా బీటెక్‌ అభ్యసించిన సౌజన్య ఎన్నికయ్యారు. గృహిణిగా ఉన్న ఈమె కొత్త బాధ్యతల్లోకి అడుగుపెట్టారు. జేగురుపాడు సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి బీఏ, బీఎల్‌ చదవి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురం సర్పంచ్‌గా ఎన్నికైన సత్యనారాయణ విద్యార్హత ఎంబీఏ. తొండంగి మండలం ఒంటిమిట్ట సర్పంచ్‌గా ఎంపికైన సుధాకర్‌ ఎంబీఏ చదివి ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు సర్పంచ్‌ కావడం విశేషం. పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి సర్పంచ్‌గా ఎంఎస్సీ బీఈడీ చదివిన లోవరాజు ఎన్నికయ్యారు. సామర్లకోట మండలం పనసపాడు సర్పంచ్‌గా ఎన్నికైన వెంకటేష్‌ ఎంబీఏ చదివి వ్యాపారం చేస్తున్నారు. కిర్లంపూడి మం డలం రామచంద్రపురం సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి అటోమొబైల్‌లో డిప్లమో చదివారు. జగ్గంపేట జె.కొత్తూరు సర్పంచ్‌ నాగేశ్వరరావు ఎంఏ చదివి ఉద్యోగం చేస్తున్నారు. కాట్రావులపల్లి సర్పంచ్‌ సగుణారావు లా చదివారు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట సర్పంచ్‌గా గెలిచిన సురేష్‌బాబు ఎంబీఏ చదివి కొత్తగా రాజకీయ నేతగా అవతరించారు. బోరమ్మపాలెం సర్పంచ్‌ సుబ్బా రావు ఎంబీఏ చదివి రైతు జీవితం గడుపుతున్నారు. తుని మండలం వి.కొత్తూరు సర్పంచ్‌గా నెగ్గిన రోజారాణి ఎంఏ, బీఈడీ చదివారు. ఎన్‌.సురవరం సర్పంచ్‌ పీజీ, ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి సర్పంచి ఎంఏ, బీఈడీ. కాజులూరు మండలం గొల్లపాలెం సర్పంచ్‌గా ఎన్నికైన మహిళ ఎంఎస్సీ, రాజానగరం, గోకవరంలో అచ్యుతాపురం, బిక్కవోలు మండలం బలబద్రపురం సర్పంచ్‌ లు ముగ్గురూ ఐటీఐ అభ్యసించి కొత్త పదవుల్లో ఆసీనులయ్యారు. ఆలమూరు సర్పంచ్‌గా ఎన్ని  కైన లావణ్య పీజీ చదివారు. మండపేట మండలం ఏడిద సర్పంచ్‌గా ఎన్నికైన ఆశీర్వాదం రిటైర్డ్‌ ఉద్యోగి కాగా, ఈయన బీఫార్మసీ అభ్యసించారు. జొన్నాడ, మూలస్థానం, పినపళ్ల అనపర్తి మండలం కొప్పవరం, బిక్కవోలు మండలం మెల్లూరు, కె.గంగవరం మండలం కూళ్ల, కె.గంగవరంలో మసకపళ్లు, కపిలేశ్వరపురంలో తాతపూడి, కేదార్లంక, కోరుమిల్లి, కాజులూరులో దుగ్గుదూరు, మతుకుమిల్లి, తిప్పరాజుపాలెం సర్పంచ్‌లుగా నెగ్గినవారం తా డిగ్రీ విద్యనభ్యసించారు. కోనసీమలోని అన్ని మండ లాల్లో డిగ్రీ పూర్తిచేసి సర్పంచ్‌లుగా నెగ్గినవారు పదుల్లో ఉన్నారు. నాలుగు దశల పంచాయతీ ఎన్నికల్లో కలిపి మహిళా సర్పంచ్‌లుగా నెగ్గిన వారిలో గృహిణుల సంఖ్య వందకుపైగానే ఉంది. వ్యవసాయ కూలీలు, ఇతర కార్మికులు కాకినాడ, రాజమహేంద్రవరం, రామచంద్రపురం, పెద్దాపురం డివిజన్లలో అధికంకాగా, రైతులు, వ్యాపారులుగా ఉంటూ సర్పంచ్‌లుగా నెగ్గిన వారిలో ఎక్కువగా కోనసీమ,పెద్దాపురం డివిజన్లలో ఉన్నారు. 2013 పంచాయతీ ఎన్నికలతో పోల్చితే ఈసారి ఉన్నత విద్యావంతులు పంచాయతీ బరిలోకి దిగడం కొంతవరకు పెరిగిందనే చెప్పాలి. ఉన్నత విద్యావంతులైన వీరు సర్పంచ్‌లుగా ఎన్నికవడంతో గ్రామా భివృద్ధిలో వీరి మార్కు ఏమేర ఉంటుందో వేచి చూడాలి.



Updated Date - 2021-02-27T07:00:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising