ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిష్కారం అయ్యేవరకూ ఉద్యమిస్తాం!

ABN, First Publish Date - 2021-07-24T06:47:47+05:30

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దిగిరాకపోతే, రానున్నకాలంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) జిల్లా చైర్మన్‌ డి రామ్మోహన్‌రావు, ఏపీసీపీయస్‌ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్‌ రవికుమార్‌, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు టి వెంకట్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు, టీచర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కదంతొక్కిన ఉపాధ్యాయ సంఘాలు
  • కలెక్టరేట్‌ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా
  • జగన్‌ హామీలు నిలబెట్టుకోవాలని హితవు

భానుగుడి(కాకినాడ), జూలై 23: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దిగిరాకపోతే, రానున్నకాలంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) జిల్లా చైర్మన్‌ డి  రామ్మోహన్‌రావు, ఏపీసీపీయస్‌ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్‌ రవికుమార్‌, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు టి వెంకట్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఉపాధ్యాయ సంఘాలు సంఘటితంగా ఉద్యమించాయి. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ పీఆర్‌సీని తక్షణం అమలు చేసి ఉపాధ్యాయులను ఆదుకోవాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను తక్షణం విడుదల చేయాలన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు చేస్తానని ఇచ్చిన హమీ రెండేళ్లు అవుతున్నా రద్దుచేయలేదని, సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దుచేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఆపత్కాలంలో ఉపాధ్యాయులు తీసుకుంటున్న ఏసీజీఎల్‌ఐ, పీఎఫ్‌ రుణాల చెల్లింపులు సకాలంలో చేయడంతోపాటు కొవిడ్‌తో మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు గ్రీన్‌చానల్‌ ద్వారా కారు ణ్య నియామకాలు చేపట్టాలన్నారు. ఎన్‌ఈపై ఇప్పటివర కూ స్పష్టత ఇవ్వకుండా దాటవేస్తూ వస్తున్న ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని, పదవీ విరమణ చేసిన, మరణించిన వారి కుటుంబాలకు రావాల్సిన పెన్షన్‌ బకాయిలు వెం టనే విడుదల చేయాలని, 3,4,5 తరగతులను హైస్కూల్‌కు తరలించే ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు. అనంత రం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

Updated Date - 2021-07-24T06:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising