మాజీ మండలాధ్యక్షుడు సింహాద్రిరాజు మృతి
ABN, First Publish Date - 2021-10-29T07:21:26+05:30
కాకినాడ రూరల్ మండల ప్రథమ మండల పరిషత్తు అధ్యక్షుడు, వైసీపీ నాయకుడు గింజాలసింహాద్రిరాజు(83) అనారోగ్యంతో గురువారం వలసపాకల లో మృతి చెందారు. శంఖవరంలో జ న్మించిన ఆయన ఇక్కడ స్థిరపడ్డారు. సింహాద్రిరాజు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కీలకంగా వ్యవహరించారు.
సర్పవరం జంక్షన్, అక్టోబరు 28: కాకినాడ రూరల్ మండల ప్రథమ మండల పరిషత్తు అధ్యక్షుడు, వైసీపీ నాయకుడు గింజాలసింహాద్రిరాజు(83) అనారోగ్యంతో గురువారం వలసపాకల లో మృతి చెందారు. శంఖవరంలో జ న్మించిన ఆయన ఇక్కడ స్థిరపడ్డారు. సింహాద్రిరాజు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కీలకంగా వ్యవహరించారు. బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన ఆయన వాకలపూడి, వలసపాకల ఉమ్మడి సర్పంచ్‌గా రెండున్నర దశాబ్ధాలుగా గ్రామస్థులకు సేవలందించారు. అనంతరం సామర్లకోట సమితి చివరి అధ్యక్షుడిగా పనిచేశారు. కాకినాడ రూరల్ మండలం ఆవిర్భవించిన తర్వాత తొలి ఎంపీపీగా సింహాద్రిరాజు సేవలందించారు. రాష్ట్ర కేబినెట్ మీటింగ్‌లో ఉండగా గింజాల సింహాద్రిరాజు మృతి వార్త తెలుసుకున్న మంత్రి కురసాల కన్నబాబు వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సింహాద్రిరాజు భౌతికకాయాన్ని ఎంపీ వంగా గీత, వైసీపీ నాయకులు కురసాల సత్యనారాయణ, జడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, ఎంపీపీ గోపిశెట్టి పద్మజాబాబ్జి సందర్శించి ఘన నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. టీడీపీ కాకినాడ రూరల్ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణమూర్తి దంపతులు భౌతికదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. సింహాద్రిరాజు మృతదేహాన్ని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, రూరల్ ఇన్‌చార్జి పంతం నానాజీ పరామర్శించి భౌతికకాయానికి నివాళులర్పించారు.
కోన ప్రాంతంలో విషాదఛాయలు
తొండంగి, అక్టోబరు 28: హార్వర్డ్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు గింజాల సింహాద్రి రాజు మృతితో కోన ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పెరుమాళ్లపురంలో ఆయన హార్వర్డ్ విద్యాసంస్థలను నెలకొల్పారు. కరస్పాండెంట్‌గా ఉన్న అల్లుడు అప్పారావుతో కలిసి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారు. సింహాద్రిరాజు మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రత్తిపాడు: గింజాల సింహాద్రిరాజు ఆకస్మిక మరణం యాదవ జాతికి తీరని లోటని యాదవ సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు గొర్ల మాణిక్యం పేర్కొన్నారు. సింహాద్రి రాజు కుటుంబసభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు.
Updated Date - 2021-10-29T07:21:26+05:30 IST