ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gorantla Butchaiah తో.. 2 గంటలకు పైగా తెలుగు తమ్ముళ్లు కీలక చర్చలు.. చివరికి ఏం తేలిందంటే..!

ABN, First Publish Date - 2021-08-21T06:30:23+05:30

Gorantla Butchaiah 2 గంటలకు పైగా తెలుగు తమ్ముళ్లు కీలక చర్చలు.. చివరికి ఏం తేలిందంటే..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సీనియర్‌ నేతలకు గుర్తింపు ఏదీ..!
  • వారి అభిప్రాయాలు తీసుకోండి.. మళ్లీ కార్పొరేషన్‌ గెలవాలి కదా..
  • చర్చలకొచ్చిన నేతలకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టీకరణ
  • కొందరి నేతల పేర్ల జాబితా అందజేసిన గోరంట్ల

 

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి), ఆగస్టు 20 : ‘సీనియర్‌ నేతలకు గుర్తింపు ఏదీ. నాకేం పర్వాలేదు. వారి అభిప్రాయాలు తీసుకోండి. మూడుసార్లు రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ వరసగా గెలిచాం. మళ్లీ రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ గెలవాలి కదా? అంతా తామేనని ఒకరు, సీనియర్లను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తే ఎలా పార్టీ పటిష్టమవుతుంది’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన అభి ప్రాయాలను స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీలో అసంతృప్తికి లోనైన గోరంట్ల అధిష్ఠానంపై రాజీనామా అస్త్రం ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధిష్ఠానం గోరంట్ల తో చర్చలకు దిగింది.


గురువారం మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఆధ్వర్యంలో ఓ బృందం   చర్చలు జరపగా, శుక్రవారం మళ్లీ రాజప్ప, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌, గన్ని కృష్ణ, ముళ్లపూడి బాపిరాజు, కేఎస్‌ జవహర్‌, రామకృష్ణారెడ్డి గోరంట్ల ఇంటికి వచ్చిన ఆయనతో సుమారు 2 గంటలకు పైగా చర్చలు నిర్వహించారు. ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలతోపాటు, రాజమహేంద్రవరంలోని సమస్యల గురించి కూడా ఆయన ప్రస్తావించినట్టు తెలిసిందే. స్థానికంగా ఆదిరెడ్డి కుటుంబ రాజకీయాల వల్ల సీనియర్‌ నేతలు పార్టీకి దూరమైపోతున్నారని కూడా ఆయన వివరించినట్టు సమాచారం. ఈ సందర్భంగా పలువురి నేతల పేర్లతో జాబితా కూడా వారికి అందజేయడం గమనార్హం. వీరితో మాట్లాడితే ఇక్కడి పరిస్థితి మీకు అర్థమవుతుందని ఆయన తెలిపినట్టు సమాచారం. కాగా గోరంట్ల అలక వహించారనే సమాచారంతో రాజమహేంద్రవరం, దాని పరిసర ప్రాంతాల నుంచి పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు గోరంట్ల ఇంటికి చేరారు. ఉదయం నుంచి సాయంకాలం వరకూ అక్కడే ఉన్నారు.

Updated Date - 2021-08-21T06:30:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising