ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం

ABN, First Publish Date - 2021-10-29T05:44:32+05:30

రాజమహేంద్రవరంలో మెరుగైన పారిశుధ్యం అందించేందుకు శానిటేషన్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నామని కార్పొ రేషన్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 28: రాజమహేంద్రవరంలో మెరుగైన పారిశుధ్యం అందించేందుకు శానిటేషన్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నామని కార్పొ రేషన్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అన్నారు. గురువారం నగరంలో 5, 8 డివిజన్లలో తడిపోడి చెత్తసేకరణ విధానాన్ని ఆయన పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు. అలాగే వైద్యపరమైన వ్యర్థాలు, అవశేషాలు, సూదులు, సిరంజిలు, నాపి ప్యాడ్‌లు ఎరుపు రంగు డస్ట్‌బిన్నుల్లో మాత్రమే వేయాలన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా వుంచడంలో ప్రజలందరు సహకరించాలన్నారు. అనంతరం ఆయన క్వారీపేటలోని చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎంహెచ్‌వో డాక్టర్‌ వినూత్న, ఎస్‌ఎస్‌, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు ఉన్నారు. 

Updated Date - 2021-10-29T05:44:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising