ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం అమ్మేదెలా!

ABN, First Publish Date - 2021-12-08T06:02:20+05:30

సామర్లకోట, డిసెంబరు 7: ధాన్యం ఎంతఉన్నా రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉండడం వల్ల రైతులు ధాన్యాన్ని ఎవరికి అమ్మాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామ ంలోని రైతుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాం సిబ్బంది సూచనల మేరకు స్థానిక రైస్‌మిల్లుకు తరలించినప్పటికీ కొందరి రై

పెదబ్రహ్మదేవంలో ధాన్యం లోడుతో ట్రాక్టర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట, డిసెంబరు 7: ధాన్యం ఎంతఉన్నా రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉండడం వల్ల రైతులు ధాన్యాన్ని ఎవరికి అమ్మాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామ ంలోని రైతుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాం సిబ్బంది సూచనల మేరకు స్థానిక రైస్‌మిల్లుకు తరలించినప్పటికీ కొందరి రైతులకు చెందిన సర్వేనెంబర్లు అనుసంధానం కాకపోవడం వల్ల ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోతున్నట్టు మిల్లర్లు చెప్పారని.. తాము ధాన్యాన్ని ఎవరికి అమ్మాలో తెలియడంలేదని రైతులు అటపాకల చిన్నా, అటపాకల రాము, కొరుప్రోలు సత్యనారాయణ వాపోయారు. ముగ్గురూ మూడు ట్రాక్టర్లలో ధాన్యం బస్తాలను మిల్లు ఎదురుగా పెట్టి మంగళవారం ఉదయం నుంచి ఎదురుచూస్తున్నారు. వేట్లపాలెంలో సుమారు 1700 ఎకరాల వరి పొలాల్లో సాగు చేసిన పంటకు ప్రభుత్వ ఆన్‌లైన్‌ సమాచారం పూర్తిగా బ్లాక్‌ అయినందున మిల్లర్లు కొనుగోలు చేసేందుకు అవరోధం గా మారింది. ఈ విషయాన్ని సుమారు 6 రోజుల క్రితమే వేట్లపాలెం వచ్చిన జేసి.సుమిత్‌ కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లగా 2 రోజు ల్లో పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చి నా నెరవేరలేదు. దీంతో మిల్లర్లు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోతున్నారు. మిల్లులకు తీసుకువస్తే తమకు బాధ్యత లేదని మిల్లర్లు చెబుతుండడంతో ధాన్యానికి రక్షణ ఎలా అని రైతులు 7ఎకరాలకు చెందిన ధాన్యం బస్తాలను ట్రాక్టర్లకు ఎక్కించిన రైతు, మాజీ పంచాయతీ సభ్యుడు వై.రామకృష్ణ వాపోయారు. ఉండూరు గ్రామంలో రైతు భరోసా కేంద్ర సిబ్బంది సెలవు కారణంగా, ప్రత్యామ్నాయంగా మరొకరిని నియమించకపోవడంతో సుమారు 750 ఎకరాలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-12-08T06:02:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising