ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెళ్లొస్తాం...

ABN, First Publish Date - 2021-01-19T07:09:36+05:30

సంక్రాంతి సందడి ముగిసింది. మూడు రోజుల పాటు సొంతూళ్లలో సంతోషంగా గడిపిన వారు ఉద్యోగాల్లో చేరేందుకు పయనమయ్యారు.

కాకినాడ బస్‌ కాంప్లెక్స్‌లో ప్రయాణికుల రద్దీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుగు ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట

ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ 8 దోచుకుంటున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌

భానుగుడి/కార్పొరేషన్‌ (కాకినాడ), జనవరి 18: సంక్రాంతి సందడి ముగిసింది. మూడు రోజుల పాటు సొంతూళ్లలో సంతోషంగా గడిపిన వారు ఉద్యోగాల్లో చేరేందుకు పయనమయ్యారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఉపాధి కోసం హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక సర్వీసులు తిప్పుతోంది. పండుగ సీజను ముగిసినా ఆర్టీసీ సాధారణ రోజుల్లో మాదిరిగానే టిక్కెట్‌ వసూలు చేస్తోంది. కాకినాడ నుంచి హైదరాబాద్‌కు 10, బెంగళూరుకు 6, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం, విజయనగం, టెక్కలి ఇలా... అంతర్‌ జిల్లా సర్వీసులు నడుపుతోంది. ప్రయాణికులు ఎవ్వరూ పడిగాపులు పడకుండా బస్సులను అందుబాటులో ఉంచుతున్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తోంది. ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు డిమాండ్‌ను బట్టి టికెట్‌ నిర్ణయిస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఓ రేటు, ట్రావెల్‌ ఏజెంట్‌ వద్దకు వెళ్లి టికెట్‌ తీసుకుంటే మరో రేటు, అత్యవసర ప్రయాణమైతే ఇంకో రేటు ఉంటోంది. ఈ విధంగా ప్రయాణికులను దోచుకుంటున్నారు. 



Updated Date - 2021-01-19T07:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising