ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ-బస్సు కారు ఢీ: నలుగురికి గాయాలు

ABN, First Publish Date - 2021-11-29T06:45:38+05:30

ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజవొమ్మంగి ఎస్‌ఐ టి.గోపి నరేంద్రప్రసాద్‌ వివరాలు అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజవొమ్మంగి, నవంబరు 28: ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజవొమ్మంగి ఎస్‌ఐ టి.గోపి నరేంద్రప్రసాద్‌ వివరాలు అందించారు.  రాజవొమ్మంగి గ్రామానికి చెందిన కనిగిరి వీరబాబు, మారుతి శ్రీను, చింతలపూడి వెంకటరమణ, వెన్న నూకరాజు ఆదివారం ఉదయం రాజవొమ్మంగి నుంచి కారులో జడ్డంగి వైపు వెళుతుండగా సింగంపల్లి ఆశ్రమ పాఠశాల సమీపంలో ఎదురుగా వస్తున్న నర్సీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొంది. దీంతో కారు ముందుభాగం నుజ్జయి అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను  జడ్డంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కనిగిరి వీరబాబు, మారుతి శ్రీను, వెన్న నూకరాజుకు తీవ్ర గాయాలుకావడంతో  మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన చింతలపూడి వెంకటరమణను రాజవొమ్మంగి పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది చికిత్స అందించారు. అలాగే బస్సులో ముగ్గురికి స్వల్ప గాయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే జడ్డంగి ఎస్‌ఐ లంకా రాజేష్‌, రాజవొమ్మంగి ఎస్‌ఐ టి.గోపి నరేంద్రప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చింతలపూడి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజవొమ్మంగి ఎస్‌ఐ టి.గోపినరేంద్ర ప్రసాద్‌ తెలిపారు. 

Updated Date - 2021-11-29T06:45:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising