ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల భవనంలో సచివాలయం

ABN, First Publish Date - 2021-09-19T05:01:26+05:30

రౌతులపూడి, సెప్టెంబరు 18: ప్రభుత్వ పాఠశాల ఆవరణ, భవనాల్లో సచివాలయాలు నిర్వహించకూడదు అన్న నిబంధన మండలంలోని మూలగపూడి గ్రామంలో అమలు కావడంలేదు. పాఠశాల భవనాల్లో నిర్వహించే సచివాలయాలను ఖాళీ చేయించి భవనాలు స్వాధీనం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ చినవీరభద్రుడు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో సీసీనం

మూలగపూడి పాఠశాల భవనంలో సచివాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూలగపూడిలో అమలుకాని నిబంధన

రౌతులపూడి, సెప్టెంబరు 18: ప్రభుత్వ పాఠశాల ఆవరణ, భవనాల్లో సచివాలయాలు నిర్వహించకూడదు అన్న నిబంధన మండలంలోని మూలగపూడి గ్రామంలో అమలు కావడంలేదు. పాఠశాల భవనాల్లో నిర్వహించే సచివాలయాలను ఖాళీ చేయించి భవనాలు స్వాధీనం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ చినవీరభద్రుడు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో సీసీనంబరు 1209- 2021 ఉత్తర్వుల ప్రకారం పాఠశాల ఆవరణలో గ్రామ సచివాలయాలు ఉండరాదన్న ఆదేశాలు అమలు కావడం లేదు. ఇప్పటికీ గ్రామంలోని పాఠశాల ఆవరణలో గల భవనంలోనే సచివాలయం ఉంది. గ్రామం పెద్దదికాడం ఎమ్‌.కొత్తూరు గ్రామానికి ఇదే సచివాలయంలోనే పాలనంతా కావడంతో వివిధ పనులు నిమిత్తం ప్రజలు అక్కడికి వస్తున్నారు. దీంతో అఽధికారులు, ప్రజలు గోలతో విద్యార్థులు పాఠ్యాంశాలపై దృష్టి సారించలేకపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్‌ తమరాల సత్యనారాయణ సచివాలయానికి బిల్డింగ్‌ను చూపించగా, వైసీపీ నేతలు మరోక భవనం చూపించడంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. వారి పంతాలతో ఇంకా సచివాలయం పాఠశాల భవనంలోనే కొనసాగుతుంది. ఇది ఇలా ఉండగా సుమారు రెండేళ్లుగా నూతన సచివాలయ పనులు సాగుతూనే ఉన్నాయి. ఇంకా సంవత్సరం దాకా సాగేలా ఉన్నాయి. 

Updated Date - 2021-09-19T05:01:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising