సామర్లకోటలో చోరీ
ABN, First Publish Date - 2021-10-31T05:09:03+05:30
సామర్లకోట, అక్టోబరు 30: సామర్లకోటలో ప్రసిద్ధి చెందిన మాండవ్య నారాయణస్వామి ఆలయంలో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం తలుపుల తాళాలు పగలకొట్టడమే గాక ఆలయంలో సీసీకెమెరాలు, హార్డ్ డిస్క్‌లు చోరీ చేశారు. హుండీలలోని సు
సామర్లకోట, అక్టోబరు 30: సామర్లకోటలో ప్రసిద్ధి చెందిన మాండవ్య నారాయణస్వామి ఆలయంలో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయ ప్రధాన ద్వారం తలుపుల తాళాలు పగలకొట్టడమే గాక ఆలయంలో సీసీకెమెరాలు, హార్డ్ డిస్క్‌లు చోరీ చేశారు. హుండీలలోని సుమారు రూ.12వేల మేర చోరీ జరిగినట్టు ఆలయ ఈవో పులి నారాయణమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, పెద్దాపురం సీఐ జయకుమార్, ఎస్‌ఐ అభిమన్యు సిబ్బంది ఆలయానికి చేరుకుని దర్యాప్తు నిర్వహించారు. కాకినాడ నుంచి వేలిముద్రల నిపుణులు చేరుకుని అనుమానిత వేలిముద్రలు సేకరించారు. చోరీలను నిరోధించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించినట్టు డీఎస్పీ తెలిపారు.
Updated Date - 2021-10-31T05:09:03+05:30 IST