ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణం తీసిన సిగ్నల్‌ సమస్య

ABN, First Publish Date - 2021-06-22T06:29:31+05:30

వై.రామవరం/రంపచోడవరం/సీలేరు, జూన్‌ 21: విశాఖ-తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో సోమవారం ఒక ట్రాక్టర్‌ బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో పది మంది వరకు తీవ్రం గాయాలయ్యాయి. వై.రామవరం మండలం పాతకోట పంచాయతీ తోటమామిళ్ల్లు (పులిమెట్ల) గ్రామానికి చెందిన 30మంది గిరిజనులను వైఎస్‌ఆర్‌ బీమా పథకంకోసం వేలిముద్రలు వేయడానికి స్థానిక వలంటీరు సో

పాతకోట వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైఎస్‌ఆర్‌ బీమా వేలిముద్ర కోసం ధారకొండ వచ్చి 

తిరిగి వెళుతుండగా ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరు మృతి.. 

మరో పదిమందికిపైగా తీవ్ర గాయాలు

వై.రామవరం/రంపచోడవరం/సీలేరు, జూన్‌ 21: విశాఖ-తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో సోమవారం ఒక ట్రాక్టర్‌ బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో పది మంది వరకు తీవ్రం గాయాలయ్యాయి. వై.రామవరం మండలం పాతకోట పంచాయతీ తోటమామిళ్ల్లు (పులిమెట్ల) గ్రామానికి చెందిన 30మంది గిరిజనులను వైఎస్‌ఆర్‌ బీమా పథకంకోసం వేలిముద్రలు వేయడానికి స్థానిక వలంటీరు సోమవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా జీకేవీధి మండలం ధారకొండకు తీసుకెళ్లారు. వీరు ఉండే ఊరి పరిధిలో సిగ్నల్‌ లేకపోవడంతో వారంతా అక్కడివరకు ట్రాక్టర్‌లో వెళ్లారు. వేలిముద్రలు వేసి తిరుగు ప్రయాణంలో మరో 15 నిమిషాల్లో వారి గ్రామానికి చేరుతారనగా వె.ౖరామవరం మండలం పాతకొత పంచాయతీ ఇసుకరేవువద్ద ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో తోటమామిళ్లు గ్రామానికి చెందిన బాలరాజు (25) అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుర్తేడు ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రగాయాలైనవారిని రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. గుర్తేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2021-06-22T06:29:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising