ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెల్మెట్‌తో ప్రాణరక్షణ

ABN, First Publish Date - 2021-01-24T06:19:53+05:30

రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా నిబంధనలు పాటించాలని, అలాగే ప్రాణరక్షణ కోసం ప్రతిఒక్కరూ హెల్మెట్‌ను ధరించాలని జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తెలిపారు.

అవగాహన కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్‌ అస్మీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ క్రైం, జనవరి 23: రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా నిబంధనలు పాటించాలని, అలాగే ప్రాణరక్షణ కోసం ప్రతిఒక్కరూ హెల్మెట్‌ను ధరించాలని జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తెలిపారు. 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కాకినాడ సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై హెల్మెట్‌ ధరించి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించని కారణంగా ఎందరో తీవ్ర గాయాల బారిన పడుతున్నారన్నారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్‌ లేని కారణంగా తలకు బలమైన గాయాలు కావడంతో అధిక సంఖ్యలో మృతి చెందుతున్నారని తెలిపారు. బైక్‌లపై ప్రయాణించేవారు విధిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు డ్రైవింగ్‌ చేయకూడదన్నారు. మితిమీరిన వేగం, సెల్‌ఫోన్‌ ఉపయోగిస్తూ డ్రైవింగ్‌ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని కోరారు.  మైనర్లకు బైక్‌లు ఇవ్వరాదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టూటౌన్‌ నుంచి జగన్నాథపురం బ్రిడ్జి వరకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ పోలీసు అధికారులు, సిబ్బంది, ఏఎన్‌ఎస్‌ పార్టీ, ఆర్మ్‌డ్‌, విద్యార్థులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ  వి.భీమారావు, ఎస్‌బీ డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్‌, ట్రాఫిక్‌ డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి, సిటీకి చెందిన పలువురు సీఐలు,ఎస్‌ఐలు, లారీ యూనియన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌  పాల్గొన్నారు.. 

Updated Date - 2021-01-24T06:19:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising