ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోరెత్తిన అశ్లీల నృత్యాలు

ABN, First Publish Date - 2021-01-16T06:32:29+05:30

సంక్రాంతి ఉత్సవాల ముసుగులో అశ్లీల నృత్యాలు హోరెత్తిపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

సంక్రాంతి ఉత్సవాల ముసుగులో అశ్లీల నృత్యాలు హోరెత్తిపోయాయి. పగలు, రాత్రి తేడా లేకుండా రికార్డింగ్‌ డ్యాన్సలతో ప్రేక్షకలోకాన్ని ఉర్రూతలూగించారు. కొత్తపేట ప్రభల తీర్థంలో పలుచోట్ల భారీగా రికార్డింగ్‌ డ్యాన్సలు నిర్వహించారు. అక్కడే పేకాట, మద్యం యథేచ్ఛగా సాగాయి. జనాలు భారీ సంఖ్యలో కార్లలో తరలివచ్చారు. రాజోలు పోలీసు సర్కిల్‌ పరిధిలోని పలు గ్రామాల్లో ఈ డ్యాన్సులు ప్రధాన రహదారుల చెంతనే జరిగాయి. మామిడికుదురు మండలం గోగన్నమఠం, ఆదుర్రు, లూటుకుర్రు, మగటపల్లి, కరవాక, రాజోలు మండలంలో పలుచోట్ల, మలికిపురం మండలం పడమటిపాలెం, సఖినేటిపల్లి మండలంలోని టేకిశెట్టిపాలెం, కేశవదాసుపాలెం, ఉప్పలగుప్తం మండలంలోని ఎన్‌.కొత్తపల్లి, గొల్లవిల్లి, భీమనపల్లి, వన్నెచింతలపూడితో పాటు 30కిపైగా ప్రాంతాల్లో అశ్లీల నృత్యాలు ప్రజలను కనువిందు చేశాయి. ఇవి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన గుండాట నిర్వాహకులకు ఆర్థికంగా చేయూతనిచ్చాయి. పోలీసులు పట్టించుకోకపోవడం, ఆయా ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడి తీవ్రంగా ఉండడం కారణంగా ఈసారి అసాంఘిక కార్యకలాపాలు మరింత పేట్రేగిపోయాయి. రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో డ్యాన్సుల హంగామా అంతా ఇంతా కాదు. కరవాకలో అయితే మితిమీరి డ్యాన్సలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి కూడా పలుచోట్ల భారీగా రికార్డింగ్‌ డ్యాన్సలు నిర్వహించారు.

Updated Date - 2021-01-16T06:32:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising